ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashok Gehlat: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాస్ డెసిషన్.. వారి జోలికెళ్తే ఇక కోతలే!

ABN, First Publish Date - 2023-08-08T21:54:25+05:30

ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. శిక్షలు సరిగ్గా అమలుకాని పక్షంలోనే.. కామాంధులు ఇలా చెలరేగిపోతున్నారు.

ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. శిక్షలు సరిగ్గా అమలుకాని పక్షంలోనే.. కామాంధులు ఇలా చెలరేగిపోతున్నారు. మహా అయితే కొంతకాలం జైల్లో వేస్తారే తప్ప, అంతకుమించి కఠిన చర్యలు తీసుకోరన్న లోకువతో.. మానవ మృగాళ్లు అడ్డూ అదుపూ లేకుండా తెగబడుతున్నారు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు.. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే మహిళలపై వేధింపులకు పాల్పడుతారో, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయాలని నిర్ణయించారు. మహిళలపై నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పిన ఆయన.. ఇందులో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకుంటున్నామని కుండబద్దలు కొట్టారు.


సోమవారం సీఎం అశోక్ గెహ్లాట్ రాజస్థాన్‌లోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. చట్టాన్ని ఉల్లంఘించిన వారి రికార్డును ఉంచాలని కోరారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకోవచ్చని సూచించారు. మహిళలను వేధించే పోకిరీలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఈ పోకిరీలు సమాజంలోని వాతావరణాన్ని చెడగొడుతున్నారని, కాబట్టి వీరికి తగిన బుద్ధి చెపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోకిరీల పేర్లను స్టాఫ్ సెలక్షన్ బోర్డు, రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌తో పంచుకుంటామని.. తద్వారా వాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, వారిని పక్కన పెట్టడానికి వీలవుతుందని తెలిపారు. వారి క్యారెక్టర్ సర్టిఫికేట్‌లలో వేధింపులకు పాల్పడ్డారని మెన్షన్ చేయబడుతుందని చెప్పారు.

కాగా.. కొంతకాలం నుంచి రాజస్థాన్‌లో మహిళలపై వరుసగా నేరాలు జరుగుతున్నాయి. దీన్నే లక్ష్యంగా చేసుకొని.. రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాన్ని భగ్నం చేస్తూనే.. మహిళల భద్రతపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజకీయ సందేశం ఇవ్వడంలో భాగంగా.. సీఎం అశోక్ గెహ్లాట్ ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలోనే ఆయన.. నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచే బార్‌లు, నైట్‌క్లబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన నిర్వాహకులు, యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. వారి లైసెన్సులను రద్దు చేస్తామని కూడా పేర్కొన్నారు.

Updated Date - 2023-08-08T21:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising