ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: మలేసియా ప్రధానితో రజనీ భేటీ

ABN, First Publish Date - 2023-09-12T10:42:16+05:30

మలేసియా పర్యటనలో ఉన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం(Anwar Ibrahim)

- ఫొటోలు షేర్‌ చేసిన అన్వర్‌ ఇబ్రహీం

అడయార్‌(చెన్నై): మలేసియా పర్యటనలో ఉన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం(Anwar Ibrahim)ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ప్రధాని అన్వర్‌ తన ‘ఎక్స్‌’ (ట్విటర్‌’) ఖాతాలో సోమవారం షేర్‌ చేసి స్పందించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీని కలవడం ఆనందంగా ఉంది. ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో తాను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారన్నారు. భవిష్యత్తులో ఆయన నటించే చిత్రాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని తాను కోరినట్టు వెల్లడించారు. రజనీకాంత్‌ తాను ఎంచుకునే ప్రతి రంగంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు’ పేర్కొన్నారు. ఇదిలావుండగా 2017లో అప్పటి మలేసియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ను రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దీంతో మలేసియా పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కానున్నారనే ప్రచారం జరగింది. ‘‘కబాలి’ షూటింగ్‌ ఎక్కువ భాగం మలేసియాలో జరిగిందని, ఆ సమయంలో ప్రధానిని కలవడం కుదరకపోవడంతో ఇపుడు కలుసుకున్నట్టు’ వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-09-12T10:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising