Rajinikanth: అర్ధరాత్రి రజినీకాంత్ ఇంటి తలుపు తట్టిన బాలిక
ABN, First Publish Date - 2023-08-09T12:20:07+05:30
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth)ను చూడాలనే తలంపుతో సేలం నుంచి వచ్చి పోయె్‌సగార్డెన్‌లో అర్ధరాత్రి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth)ను చూడాలనే తలంపుతో సేలం నుంచి వచ్చి పోయె్‌సగార్డెన్‌లో అర్ధరాత్రి ఆయన ఇంటి తలుపు తట్టి కలకలం సృష్టించిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని కుటుంబీకులకు అప్పగించారు. సేలం పెద్ద నాయకంపాళయంకు చెందిన దీపికా(15) టెన్త్ చదువుతోంది. సోమవారం ఉదయం టీచర్ ఇంటికి వెళుతున్నట్లు కుటుంబీకులకు తెలిపి తన అభిమాన నటుడు రజినీకాంత్‌ను చూడాలనే కోరికతో బస్సెక్కి చెన్నైకి బయలుదేరింది. రాత్రి కోయంబేడు బస్‌స్టేషన్ నుంచి ఆటో ఎక్కి పోయె్‌సగార్డెన్‌లో రజినీ ఇంటికి చేరింది. ఆ తర్వాత ఇంటి గేటును దీపా తట్టడంతో డ్యూటీలో ఉన్న వాచ్‌మేన్ గమనించి ఆ విషయాన్ని తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి దీపికను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి అసలు సంగతి తెలుసుకున్నారు. ఆ తర్వాత పల్లావరం పమ్మల్ ప్రాంతంలో ఆ బాలిక బామ్మ ఉన్నట్లు తెలుసుకుని అప్పటికప్పుడు పోలీసులు వ్యాన్‌లో సురక్షితంగా బామ్మ ఇంటికి చేర్చారు. ఆ తర్వాత బాలిక చెన్నైలోని బామ్మ ఇంటిలో క్షేమంగా ఉన్నట్లు సేలంలోని కుటుంబీకులకు పోలీసులు ఫోన్ చేసి తెలిపారు.
Updated Date - 2023-08-09T12:20:09+05:30 IST