Delhi Liquor Scam: త్వరలో మరో ఛార్జిషీట్ దాఖలు చేసే యోచనలో ఈడీ
ABN, First Publish Date - 2023-04-17T15:34:30+05:30
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Delhi former Deputy Chief Minister Manish Sisodia)కు ఊరట లభించడం లేదు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam) ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Delhi former Deputy Chief Minister Manish Sisodia)కు ఊరట లభించడం లేదు. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఎవెన్యూ కోర్ట్ (Rouse Avenue Court) పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 27 వరకూ, ఈడీ కేసులో ఈ నెల 29 వరకూ జుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. అరుణ్ పిళ్లై కస్టడీని కూడా న్యాయస్థానం వచ్చే నెల ఒకటో తేదీ దాకా పొడిగించింది.
సిసోడియాను సీబీఐ అధికారులు, ఈడీ అధికారులు వేరుగా ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో త్వరలో ఈడీ మరో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. సిసోడియా, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, అమన్దీప్ధాల్ పై అదనపు ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఇప్పటికే ఒక ప్రధాన, 2 అదనపు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. మూడో అదనపు ఛార్జిషీట్లో సిసోడియా, రామచంద్రన్ పిళ్ళై, అమన్దీప్ దాల్పై అభియోగాలు నమోదు చేయనుంది.
ఢిల్లీ మద్యం విధానం (Delhi Excise Policy 2021-22) రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. అప్పటినుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు.
ఇదే కేసుకు సంబంధించి నిన్ననే ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను (Delhi Chief Minister Arvind Kejriwal) సీబీఐ (Central Bureau of Investigation-CBI) అధికారులు ప్రశ్నించారు. కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు 161 సీఆర్‌పీసీ కింద ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్షిగానే ఆయన్ను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్షులు, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నించారు. మౌఖికంగా కేజ్రీవాల్ నుంచి సమాధానాలు తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో అక్రమాలు,.. కమీషన్ రేట్లను పెంచడం అంశాలపై ప్రశ్నించారు. సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో సంబంధాలపై సీబీఐ ప్రశ్నలు సంధించింది. సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకు.. మంత్రివర్గం ఆమోదం, సౌత్ గ్రూప్తో సంబంధాలపై సీబీఐ ప్రశ్నించింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా.. కేజ్రీవాల్ను ప్రశ్నించారు.
త్వరలో కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
Updated Date - 2023-04-17T16:40:39+05:30 IST