ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RS Bharati: ఆయన జైలుకెళ్లడం ఖాయం..

ABN, First Publish Date - 2023-05-13T07:59:53+05:30

తమ పార్టీ నేతలపై చేసిన తీవ్రమైన ఆరోపణల కారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ నేతలపై చేసిన తీవ్రమైన ఆరోపణల కారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) జైలుకెళ్లడం ఖాయమని డీఎంకే అధికార ప్రతినిధి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharati) పేర్కొన్నారు. అన్నామలైపై డీఎంకే కోశాధికారి, ఎంపీ టీఆర్‌ బాలు(MP TR Balu) శుక్రవారం స్థానిక సైదాపేట కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆయనతో కలిసి కోర్టుకు వచ్చిన ఆర్‌ఎస్‌ భారతి మీడియాతో మాట్లాడుతూ... అన్నామలై గత నెల 14న డీఎంకే నేతలపై అసత్య ప్రచారాలు చేశారన్నారు. ఆ అసత్య ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నామలైకు నోటీసులు జారీ చేశామన్నారు. నెల గడిచినా ఆయన నుంచి ఎలాంటి సంజాయిషీ కానీ, క్షమాపణ గానీ రాకపోవడంతో ఆయనపై పరువునష్టం దావాలు దాఖలు చేశామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి తరఫున పరువునష్టం దావా దాఖలు కాగా, తాజాగా పార్టీ ఎంపీ టీఆర్‌ బాలు తరఫున సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖల చేశామన్నారు. డీఎంకే ఎవరిపైనా తప్పుడు పిటిషన్లు దాఖలు చేయలేదని, అదే సమయంలో దాఖలు చేసిన అన్ని కేసుల్లోనూ విజయం సాధించిందని గుర్తుచేశారు. గతంలో డీఎంకే(DMK) కోశాధికారిగా వ్యవహరించిన కరుణానిధి 60 ఏళ్ల క్రితం ‘నార్తిగం’ పత్రిక సంపాదకుడిపై పరువు నష్టం దావా వేయడంతో ఆయనకు రెండేళ్ల శిక్ష పడిందని, తాజాగా డీఎంకే కోశాధికారిగా ఉన్న టీఆర్‌ బాలు దాఖలు చేసిన పరువునష్టం కేసులో కూడా అన్నామలైకు రెండేళ్ల జైలుశిక్ష పడడం ఖాయమని ఆర్‌ఎస్‌ భారతి పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్‌ వాదనలు వినిపించనున్నారు.

Updated Date - 2023-05-13T07:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising