ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RSS: కులగణనకు తాము వ్యతిరేకం కాదు.. డేటాను సమాజ హితానికి ఉపయోగించాలన్న ఆర్ఎస్ఎస్

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:33 AM

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కులగణనకు(Caste Census) తాము వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) స్పష్టం చేసింది.

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కులగణనకు(Caste Census) తాము వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రచార హెడ్ సునీల్ అంబేకర్ తాజాగా ఈ విషయంపై స్పష్టతనిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. "కులగణన ప్రక్రియను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించడం లేదు.

అయితే కులగణన చేపట్టిన తరువాత ఆ డేటాను సమాజ హితానికి వినియోగించాలి. దీనిపై ఎలాంటి రాజకీయాలు ఉండకూడదు. కొందరు రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునే ప్రమాదం ఉంది. ఎలాంటి వివక్ష, అసమానతలు లేని హిందూ సమాజంకోసం ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తుంది. సమాజాభివృద్ధి కాంక్షించేలా కులగణన చేపట్టాలి.


అన్ని పార్టీలు సామరస్యపూర్వక వాతావరణంలో గణన చేపట్టాలి. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఐక్యత విచ్ఛిన్నం కాకూడదు. వివిధ కారణాల వల్ల సమాజంలోని అనేక వర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యలో వెనబడ్డారు. ప్రభుత్వాలు వారిని ఆదుకోవడానికి చేపడుతున్న పనులకు ఆర్ఎస్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుంది" అని అంబేకర్ అన్నారు.

కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు కుల గణన డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కులగణనే ఎన్నికల అస్త్రంగా కాంగ్రెస్ వినియోగించుకుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి ప్రజలపై దీనినే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ మార్చనుంది. కొన్నాళ్ల క్రితమే బిహార్ సర్కార్ కులగణన నివేదిక బయటపెట్టింది.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 22 , 2023 | 01:20 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising