ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Satyendar Jain: సత్యేంద్ర జైన్ బెయిల్ మరోసారి పొడిగించిన సుప్రీం కోర్టు

ABN, First Publish Date - 2023-09-25T18:48:21+05:30

ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత సత్యేంద్ర జైన్‌(Satyendra Jain)కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్‌ను మరోసారి పొడిగించింది. అక్టోబర్ 9 వరకు బెయిల్ పొడిగింపును మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తొలుత మే 26న మెడికల్ బెయిల్(Bail) మంజూరు చేశారు.

ఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత సత్యేంద్ర జైన్‌(Satyendra Jain)కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్‌ను మరోసారి పొడిగించింది. అక్టోబర్ 9 వరకు బెయిల్ పొడిగింపును మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తొలుత మే 26న మెడికల్ బెయిల్(Bail) మంజూరు చేశారు. జులై 21న వెన్నెముకకు ఆపరేషన్ జరగడంతో బెయిల్ గడువును పొడగిస్తూ వచ్చింది కోర్టు. తాజా పొడగింపు అనంతరం విచారణకు తప్పకుండా హాజరుకావాలని సూచించింది. తదుపరి విచారణ వరకు బెయిల్‌ను పొడిగిస్తూ, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది.


మనీలాండరింగ్(money laundering) కేసులో జైన్‌తో ముడిపడి ఉన్న లావాదేవీల చార్ట్‌ను ఈడీ కోర్టుకు సమర్పించింది. అనంతరం జైన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు అక్టోబర్ 9కి వాయిదా వేసింది. ఆయన నాలుగు లింక్డ్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017లో జైన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు టేకప్ చేసింది. ఇందులో భాగంగా ఆయనకు చెందిన రూ.4 కోట్ల 81 లక్షల విలువైన ఆస్తులను గతేడాది అటాచ్ చేసింది.

Updated Date - 2023-09-25T18:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising