ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur Vilolence: మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్తతలు.. రంగంలోకి శ్రీనగర్ పోలీస్

ABN, First Publish Date - 2023-09-28T16:22:24+05:30

మణిపుర్(Manipur) రాష్ట్రంలో కుకి, మైతేయి తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణ మరవక ముందే మరోసారి అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. 3 నెలల క్రితం ఇద్దరు స్టూడెంట్స్(Students) ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.

మణిపుర్: మణిపుర్(Manipur) రాష్ట్రంలో కుకి, మైతేయి తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణ మరవక ముందే మరోసారి అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. 3 నెలల క్రితం ఇద్దరు స్టూడెంట్స్(Students) ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. వారి మృతదేహాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని ఇంఫాల్(Imphal) తో పాటు చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. పరిస్థితులు చేయి దాటకముందే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఓ సీనియర్ పోలీస్ అధికారిని రంగంలోకి దింపింది.


జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్(Srinagar) లో సీనియర్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాకేష్ బల్వాల్ ను మణిపుర్ కి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ కు చెందిన ఆయన 2012 ఐపీఎస్ అధికారి. గతంలో మణిపుర్ కేడర్ లో విధులు నిర్వహించారు. తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కి ఎస్ పీగా పదోన్నతి పొందారు. పుల్వామా ఉగ్రదాడి కేసులో దర్యాప్తు జరిపిన బృందంలో బల్వాల్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఉద్రిక్తతలను చల్లార్చడంలో కీలకంగా వ్యవహరిస్తారనే నమ్మకంతోనే మణిపుర్ బదిలీ చేశారన్న చర్చ నడుస్తోంది.

Updated Date - 2023-09-28T16:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising