ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCP Crisis: పోటాపోటీగా పార్టీ సమావేశాలకు పవార్ ద్వయం పిలుపు..

ABN, First Publish Date - 2023-07-04T15:13:50+05:30

నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం మరింత ముదురుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో పార్టీ పునర్మిర్మాణానికి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ పట్టుదలతో ఉండగా, పార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నందున తనదే అసలైన ఎన్‌సీపీ పార్టీ అంటూ అజిత్ పవార్ అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు నేతలూ ఎన్‌సీపీ సమావేశానికి పులుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో ఏర్పడిన సంక్షోభం (Crisis) మరింత ముదురుతోంది. అజిత్ పవార్ (Ajit Pawar) తిరుగుబాటుతో పార్టీ పునర్మిర్మాణానికి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పట్టుదలతో ఉండగా, పార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నందున తనదే అసలైన ఎన్‌సీపీ పార్టీ అంటూ అజిత్ పవార్ అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు నేతలూ ఎన్‌సీపీ సమావేశానికి పులుపునిచ్చారు. ఇద్దరూ పిలుపునిచ్చిన సమావేశం తేదీ కూడా ఒకే రోజు కావడంతో ఇది బలప్రదర్శనకు దారితీస్తుందా? ఎవరిపై ఎవరిది పైచేయి అవుతుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

5వ తేదీన సమావేశం..

శివసేన-బీజేపీ కూటమికి ఈనెల 2న మద్దతు ప్రకటించి, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అజిత్ పవార్ మంగళవారంనాడు ఓ ట్వీట్‌లో ఎన్‌సీపీ సమావేశానికి పిలుపునిచ్చారు. ఎన్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా హెడ్స్, రాష్ట్ర ప్రతినిధులు ఈనెల 5న ఎంఇటీ బాంద్రాలో జరిగే పార్టీ సమావేశానికి హాజరుకావాలని అజిత్ ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో, శరద్ పవార్ సైతం ఎన్‌సీపీ సభ్యులంతా 5వ తేదీన వైబీ చవాన్ ఆడిటోరియంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ట్వీట్ చేశారు.

శరద్ పవార్‌కు తెలియకుండా అత్యంత గోప్యంగా అజిత్‌ తిరుగుబాటు చేయడం మహారాష్ట్ర రాజకీయలను కుదిపివేయగా, శరద్ పవార్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లు చేసి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇవాళ జరిగిన పరిణామానికి తాను బాధపడటం లేదని, పార్టీ ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నోసార్లు గతంలో ఎదుర్కొందని, కిందపడిన ప్రతిసారి తిరిగి పుంజుకుందని, ఇప్పుడు కూడా పార్టీ పునర్నిర్మాణానికి శక్తియుక్తులు ధారపోస్తానని శరద్ పవార్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన ప్రజల్లోకి వెళ్తూ, ఎన్‌సీపీలో తిరుగుబాటు వెనుక ఉన్న శక్తులెవరో వివరిస్తున్నారు. ఈ క్రమంలో, పవార్ ద్వయం ఈనెల 5న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతినిధులతో సమావేశానికి పిలుపునివ్వడం ద్వారా తమ సత్తా చాటుకునే ప్రయత్నంలో ఉండటంతో ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభం ముదురుపాకాన పడుతోంది.

Updated Date - 2023-07-04T15:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising