ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi:ఇండియా కుటమిలో లుకలుకలు.. శరద్ పవార్ మోదీని కాపాడుతున్నారని రాహుల్ విమర్శ

ABN, First Publish Date - 2023-10-18T14:47:05+05:30

ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మహారాష్ట్ర(Maharashtra)కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత శరద్ పవార్(కూటమి సభ్యుడు) ఇటీవల గుజరాత్ లో అదానీని కలవడంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మహారాష్ట్ర(Maharashtra)కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత శరద్ పవార్(కూటమి సభ్యుడు) ఇటీవల గుజరాత్ లో అదానీని కలవడంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సైతం స్పందించారు.శరద్ పవార్.. అదానీని రక్షించడం లేదని.. ప్రధాని మోదీని కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని అదానీని కాపాడుతున్నారని రాహుల్ విమర్శించారు. శరద్ పవార్(Sharadh Pawar) ప్రధాని కాదని.. అదానీతో ఆయన కలవడంపై తాను స్పందించబోనని తెలిపారు. అదానీ కంపెనీలు ఇండోనేసియా నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్నాయని, భారత్ కు వచ్చేసరికి బొగ్గు ధర రెట్టింపు అవుతోందని ఓ నివేదిక వెల్లడించిందని రాహుల్ గాంధీ తెలిపారు. "నేను శరద్ పవార్‌ని ఈ ప్రశ్న అడగలేదు. పవార్ అదానీని రక్షించడం లేదు. మోడీని అడిగాను. శరద్ పవార్ ప్రధానిగా ఉండి అదానీని రక్షిస్తున్నట్లయితే, నేను ఈ ప్రశ్నను ఆయనకే అడిగేవాడిని" అని రాహుల్ అన్నారు. శరద్ పవార్ ఇటీవల గుజరాత్ లో ఓ ప్లాంట్ ప్రారంభోత్సవంలో అదానీని కలిసిన సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీతో శరద్ పవార్ కు ఉన్న సంబంధాలపై విచారణ జరపాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది.


గెలిస్తే అదానీపై విచారణ: రాహుల్ గాంధీ

సబ్సిడీ విద్యుత్‌ ఇస్తున్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు అదానీపై రాష్ట్ర స్థాయిలో విచారణ జరిపే అవకాశాలను పరిశీలించవచ్చని రాహుల్‌ గాంధీ అన్నారు. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదానీపై విచారణ జరుపుతుందా అని అడిగిన ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ.. "ఇది అదానీ గురించి ప్రశ్న కాదు. ఎవరైనా రూ.32 వేల కోట్లు దొంగిలిస్తే విచారణ ఎదుర్కోవాలి" అని ఆయన అన్నారు.

Updated Date - 2023-10-18T14:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising