ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sharad Pawar : పవార్ ప్రకటనపై ప్రకంపనలు.. విపక్షాల స్పందన ఏమిటంటే..?

ABN, First Publish Date - 2023-05-02T17:22:27+05:30

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మహారాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధుడు, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మహారాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధుడు, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) చేసిన కీలక ప్రకటనలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్‌సీపీ కారహ్యకర్తలు పవార్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతుంటే, మరికొందరు కన్నీరు పెడుతున్నారు. తన మేనల్లుడు అజిత్ పవార్ వ్యవహార శైలే ఆయన ప్రకటనకు కారణం కావచ్చనే ఊహాగానాలు ఒకవైపు వినిపిస్తుండగా, ఎన్‌సీపీ మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, అధికార బీజేపీ ఆచితూచి స్పందిస్తున్నాయి.

ఎన్సీపీ అంతర్గత వ్యవహారం: ఫడ్నవిస్

పవార్ నిర్ణయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆచితూచి స్పందించారు. పవార్ నిర్ణయం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, పవార్ చాలా సీనియర్ నేత అని, ఆయన నిర్ణయం వ్యక్తిగతమని అన్నారు. . దీనిపై ఈ సమయంలో మాట్లాడటం సరికాదన్నారు. పరిస్థితిని నిశితంగా గమనించి ఒకటి రెండు రోజుల్లో స్పందిస్తామని ఫడ్నవిస్ తెలిపారు.

ఆలోచించకుండా పవార్ నిర్ణయం తీసుకోరు: తారిఖ్ అన్వర్

కాగా, పవార్ నిర్ణయంపై ఆయన మజీ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత తారిఖ్ అన్వర్ స్పందించారు. ఆయనకు భవిష్యత్ వ్యూహం తప్పనిసరిగా ఉండి ఉంటుందని అన్నారు. ఏ విషయాన్నీ కూలంకషంగా పరిశీలించకుండా పవార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరని అన్నారు. ఏ పరిస్థితుల్లో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారనేది ఆయన, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలరని అన్నారు. దేశ రాజకీయాల్లో పవార్ కీలక పాత్ర పోషించారని, ఈరోజు విపక్ష వాణిని వినిపిస్తూ విపక్షాల ఐక్యతకు పిలుపునిచ్చి, ఆ దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు.

ఎన్సీపీ కార్యకర్తల నిరనన..

మరోవైపు, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు పవార్ ప్రకటన చేయగానే ఎన్‌సీపీ వర్కర్లు నిరనకు దిగారు. ముంబైలోని వైబీ వాన్ కేంద్ర వెలుపల పెద్దఎత్తున కార్యకర్తలు నిరనన చేపట్టారు. దీంతో ఎన్‌సీపీ నేత సుప్రియా సులే, అజిత్ పవార్ తదితర ఎన్‌సీపీ నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.

Updated Date - 2023-05-02T17:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising