ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Internet : తరచూ ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేసే ఏకైక ప్రజాస్వామిక దేశం భారత్ : శశి థరూర్

ABN, First Publish Date - 2023-07-16T12:03:53+05:30

సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తూ, సుదీర్ఘ కాలం ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిషేధిస్తున్న ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేయడం వల్ల ఉగ్రవాదం, హింస తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు.

Shashi Tharoor
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తూ, సుదీర్ఘ కాలం ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిషేధిస్తున్న ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Congress MP Shashi Tharoor) ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేయడం వల్ల ఉగ్రవాదం, హింస తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు. మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధం గురించి సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపబోతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శశి థరూర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, మణిపూర్‌లో దాదాపు మూడు నెలల నుంచి ఇంటర్నెట్ సదుపాయంపై నిషేధం అమలవుతోందని, దీనివల్ల డిజిటల్ లైఫ్ తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. ఈ దుర్మార్గమైన నిషేధాన్ని సడలించాలని మణిపూర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని, ఈ అపీలుపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరపబోతోందని తెలిపారు. ఇంటర్నెట్ షట్‌డౌన్ వల్ల హింస ఆగుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2022లో గుర్తించిందని తెలిపారు. దీనిని నిషేధించడం వల్ల ఎక్కడైనా హింసను లేదా ఉగ్రవాదాన్ని నిరోధించడం అటుంచి, కనీసం అడ్డుకున్నట్లు తెలిపే ఆధారాలను ప్రభుత్వం సమర్పించలేకపోయిందని చెప్పారు. ప్రయోజనకరమైన భద్రతా చర్యల కన్నా అధికారులు అమలు చేసే అకస్మాత్తు చర్యలు సామాన్య ప్రజలకు మరింత ఎక్కువ అసౌకర్యాన్ని కలిగిస్తాయన్నారు. సుదీర్ఘ సమయంపాటు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేసే ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని, ఇది చాలా విచిత్రమని తెలిపారు. ఇంటర్నెట్‌ను నిలిపేయడం వల్ల హింసాత్మక సంఘటనలపై ఎటువంటి ప్రభావం కనిపించకపోయినప్పటికీ, సామాన్యులకు చెప్పుకోదగ్గ స్థాయిలో అసౌకర్యం కలిగిస్తున్నప్పటికీ తరచూ ఇంటర్నెట్ సదుపాయాన్ని నిషేధిస్తున్నారని మండిపడ్డారు.

కళ్లకు గంతలు కట్టుకున్న అధికారులకు కాకుండా సామాన్య ప్రజల హక్కులకు సంఘీభావంగా సుప్రీంకోర్టు నిలుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకున్న అధికారులు తాము తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతోందో గుర్తించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. సామాన్యులు ఇంటర్నెట్‌ను అనేక రకాలుగా ఉపయోగించుకుంటారని తెలిపారు. బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, ఎన్‌రోల్‌మెంట్స్, పరీక్షలు, అన్ని రకాల కీలక సమాచారం పొందడం కోసం సామాన్యులకు ఇంటర్నెట్‌ అవసరమని చెప్పారు. ఈ దురాచారానికి కోర్టు ఇప్పటికైనా ముగింపు పలకాలని ఆకాంక్షించారు.

మణిపూర్‌లో మే నెల నుంచి మెయిటీలు, కుకీల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాలతోనూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. సైన్యాన్ని మోహరించినప్పటికీ, ఘర్షణలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే సందేశాలు, వదంతులు ప్రసారం కాకుండా నిరోధించేందుకు అధికారులు ఇంటర్నెట్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. ఈ నిషేధాన్ని ఎత్తేయాలని మణిపూర్ హైకోర్టు జూలై 7న ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ హింసపై స్పందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనిని లేవనెత్తుతామని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

S Jaishankar : ఉత్తమ దౌత్యవేత్త హనుమంతుడు : ఎస్ జైశంకర్

Yamuna Floods : ఢిల్లీలో మళ్లీ కురుస్తున్న వర్షాలు.. యమునా నదిలో ప్రమాద స్థాయి దాటిన నీటి మట్టం..

Updated Date - 2023-07-16T12:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising