ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marathon: మాంచెస్టర్ మారథాన్‌లో సత్తాచాటిన భారతీయ మహిళ

ABN, First Publish Date - 2023-04-19T22:54:57+05:30

మాంచెస్టర్ మారథాన్‌ (Manchester Marathon) పరుగుల పోటీలో మధుస్మితా జెనా-దాస్ (Madhusmita Jena Das) సత్తాచాటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాంచెస్టర్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు క్రీడల్లో కూడా మహిళలు తమ సత్తాచాటుతున్నారు. అయితే ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ సిటీలో నిర్వహించిన మాంచెస్టర్ మారథాన్‌ (Manchester Marathon) పరుగుల పోటీలో మధుస్మితా జెనా-దాస్ (Madhusmita Jena Das) సత్తాచాటారు. మాంచెస్టర్ మారథాన్‌లో 4 గంటల 50 నిమిషాల్లో 42.5 కిలోమీటర్లు పరిగెత్తి సంచలనం సృష్టించారు. ఎరుపు రంగుల్లో ఉన్న సంబల్‌పురి చేనేత చీరను ధరించి ఆమె మారథాన్‌ను పూర్తి చేసింది.

మారథాన్‌లో ఎరుపు రంగు చీరలో దాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 41 ఏళ్ల ఒడియా మహిళ మధుస్మితా జెనా-దాస్ యూకేలోని మాంచెస్టర్‌లో నివసిస్తున్నారు. ఈ వీడియోను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 45,700 కంటే ఎక్కువ మంది వీక్షించగా, వెయ్యికి పైగా లైక్‌లు వచ్చాయి. మధుస్మిత జెనా-దాస్ అద్భుతమంటూ ట్వీ్ట్టర్ యూజర్స్ ప్రశంసించారు.

Updated Date - 2023-04-19T22:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising