Man hurls Shoe: ఎస్‌పీ నేతపై షూ విసిరిన అగంతకుడు..ఉద్రిక్తత
ABN, First Publish Date - 2023-08-21T14:09:36+05:30
సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఒక వ్యక్తి షూ విసరడం ఉద్రిక్తతతకు దారితీసింది. లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్ వద్ద సోమవారం జరిగిన ఓబీసీ సమ్మేళన్‌లో మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాయర్ దుస్తుల్లో ఉన్న ఓ యువకుడు మౌర్యపై షూ విసిరాడు. దీంతో వెంటనే మౌర్య మద్దతుదారులు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు.
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) నేత స్వామి ప్రసాద్ మౌర్య (Swamy prasad mourya) పై ఒక వ్యక్తి షూ విసరడం ఉద్రిక్తతతకు దారితీసింది. లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్ వద్ద సోమవారం జరిగిన ఓబీసీ సమ్మేళన్‌లో మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాయర్ దుస్తుల్లో ఉన్న ఓ యువకుడు మౌర్యపై షూ విసిరాడు. దీంతో వెంటనే మౌర్య మద్దతుదారులు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు. 'స్వామి ప్రసాద్ మౌర్య జిందాబాద్' అని నినాదాలు చేస్తూనే ఆ వ్యక్తిపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. దాడిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ మౌర్య మద్దతుదారులు వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నాయి.
Updated Date - 2023-08-21T14:11:25+05:30 IST