ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marthon meetings: టార్గెట్-20 లక్ష్యంగా సిద్ధూ, డీకే...

ABN, First Publish Date - 2023-08-06T19:38:34+05:30

లోక్‌సభ ఎన్నికల్లో 20 ఎంపీ సీట్లు లక్ష్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసససభ్యులతో మూడు రోజుల పాటు సుదీర్ఘ సమావేశాలు జరుపనున్నారు. రాబోయే మూడు రోజుల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి.

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) 20 ఎంపీ సీట్లు లక్ష్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivkumar) కాంగ్రెస్ శాసససభ్యులతో మూడు రోజుల పాటు సుదీర్ఘ సమావేశాలు జరుపనున్నారు. రాబోయే మూడు రోజుల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని డీకే శివకుమార్ ఆదివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో ధ్రువీకరించారు. సోమవారం నుంచి తాను, సీఎం కలిసి జిల్లా నేతలతో సమావేశం కానున్నామని, ఇందులో భాగంగా ఈరోజు పార్టీ మైనారిటీ నేతలతో తాను సమావేశమయ్యానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా ఉన్న డీకే తెలిపారు.


పార్టీ కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం, జిల్లాల ఇన్‌చార్జులు, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ సీఎం ఆఫీస్ రెసిడెన్స్‌లో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు విరామం ఉంటుంది. సోమవారంనాడు తుంకూరు, యాద్‌గిర్, చిత్రదుర్గ, బాగల్‌కోట్, బల్లారి, ధార్వాడ్ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య, డీకే సమవేశమవుతారు. ప్రతి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో గంట సేపు చొప్పున 31 మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. మొత్తం 3 రోజుల్లో 31 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితోనూ సమావేశాలు జరుపుతారు.


జిల్లాల్లో పార్టీని మరింత పటిష్టం చేయడం, మరిన్ని పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయడం, లోక్‌సభ ఎన్నికల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వంటివి ఈ సమావేశాల ఉద్దేశంగా ఉంది. ఎమ్మెల్యేల సమస్యలను కూడా సీఎం, డిప్యూటీ సీఎం తెలుసుకుంటారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లలో గెలుపు లక్ష్యంగా ఈ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. 2019 ఎన్నికల్లో 28 స్థానాలకు బీజేపీ 20 సీట్లు, కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకుంది. కాగా, తమతమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల విషయంపై చర్చించేందుకు 20 మంది మంత్రులు సహకరించడం లేదని 11 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం ఈ మారథాన్ సమావేశాలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-08-06T19:38:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising