ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Siddaramaiah: అవినీతి కేసులపై చర్యలకు వెనుకాడం: సిద్ధరామయ్య

ABN, Publish Date - Dec 17 , 2023 | 06:58 PM

అవినీతి కేసులపై తమ ప్రభుత్వం మౌన ప్రేక్షకునిలా చూస్తూ ఊరుకోదని, అవినీతికి ఎవరు పాల్పడినా వారిపై చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారంనాడు తెలిపారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని గత బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన 40 శాతం కమిషన్ల ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని, దోషులని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బెంగళూరు: అవినీతి (corruption) కేసులపై తమ ప్రభుత్వం మౌన ప్రేక్షకునిలా చూస్తూ ఊరుకోదని, అవినీతికి ఎవరు పాల్పడినా వారిపై చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆదివారంనాడు తెలిపారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని గత బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన 40 శాతం కమిషన్ల ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని, దోషులని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.


''రాష్ట్రంలో అవినీతికి సంబంధించిన ఏ కేసులపైన ప్రభుత్వం మౌనంగా కూర్చోదు. విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటాం'' అని సీఎం చెప్పారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు డ్రైవర్ ఉద్యోగాల కోసం లంచాలు అడుగుతున్నారంటూ వస్తున్న ఆరోపణలపై అడిగినప్పుడు, వాటిపై విచారణ జరుపుతామని జవాబిచ్చారు.


కులగణన అశాస్త్రీయంగా ఉందన్న ఆరోపణలపై సీఎంను ప్రశ్నించినప్పుడు, వెనుకబడిన తరగతుల కమిషన్ ఇంకా ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, నివేదిక రాకుండానే కొందరు ఆశాస్త్రీయం అంటూ కామెంట్లు చేస్తున్నారని ఆయన చెప్పారు. రిపోర్టులో ఏముందో తెలియకుండా ఊహాగానాలు చేయడం సరికాదని, ముందు నివేదక రానీయండని ఆయన అన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 06:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising