ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Smallest polling booth: దేశంలోనే అతి చిన్న పోలింగ్ బూత్...కేవలం ఐదుగురే ఓటర్లు..ఎక్కడో తెలుసా?

ABN, First Publish Date - 2023-10-14T14:33:45+05:30

ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపోటములకు ఒక్క ఓటు కూడా కీలకమే అవుతుంది. అయితే, ఐదు ఓట్ల కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసిన వైనం మీకు తెలుసా? దేశంలోనే అతి చిన్న పోలింగ్ బూత్‌‌ ఇది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లో ఈ పోలింగ్ బూత్ ఉంది.

రాయపూర్: ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపోటములకు ఒక్క ఓటు కూడా కీలకమే అవుతుంది. అయితే, ఐదు ఓట్ల కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసిన వైనం మీకు తెలుసా? దేశంలోనే అతి చిన్న పోలింగ్ బూత్‌‌ ఇది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌ (Chhattishgarh)లో ఈ పోలింగ్ బూత్ ఉంది. భూపేష్ బఘెల్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తిరిగి అధికారం కోసం కృషి చేస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీని కార్నర్ చేసి అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. నవంబర్ 7న ఇక్కడ పోలింగ్ జరుగనుంది.


మూడే ఇళ్లు...ఐదుగురే ఓటర్లు

ఛత్తీస్‌గఢ్‌లోని భరత్‌పూర్ సన్హాట్‌లో షెరదాండ్ (Sheradand) గ్రామం ఉంది. 15 ఏళ్ల క్రితం అంటే 2008లో ఇద్దరు ఓటర్ల కోసం ఒక గుడిసెలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఈ గ్రామం వెలుగుచూసింది. కొరియా జిల్లా సోన్హట్ బ్లాక్ చంద్ర గ్రామ్ పంచాయతీకి చెందిన డిపెండెంట్ విలేజ్ ఇది. దట్టమైన అడవుల్లోని ఈ షెరదాండ్‌లో కేవలం మూడు ఇళ్లు ఉన్నాయి. 60 ఏల్ల మహిపాల్ రామ్ అనే వ్యక్తి తన గుడిసెలో ఒంటరిగా ఉంటున్నారు. రెండో ఇంటిలో రామ్‌ప్రసాద్ చెర్వా అనే వ్యక్తి తన భార్య సింగారో, నలుగురు పిల్లలతో ఉంటున్నారు. మూడో ఇంటిలో దస్రు రాము అనే వ్యక్తి తన భార్య సుమిత్ర, ఒక కుమార్తె, మరో కుమారుడితో ఉంటున్నారు. ఈ మూడిళ్లకు కలిపి ఐదుగురు ఓటర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఓటర్లలో దస్రు రాము ఐదేళ్ల క్రితం జష్‌పూర్ నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 148వ పోలింగ్ స్టేషన్ వీరికోసమే ఏర్పాటు చేశారు. 2008 నుంచి ఒక గుడిసెలో ఓటింగ్ జరిగేది. ప్రస్తుతం ఇక్కడ పక్కా భవనం నిర్మించారు. కాగా, ఇదే అసెంబ్లీకి చెందిన కాంటోలో 12 మంది ఓటర్లు, రేవలలో 23 ఓటర్లు ఉన్నారు.

Updated Date - 2023-10-14T14:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising