Sonia Gandhi: పడవలో ప్రయాణించిన సోనియాగాంధీ
ABN, First Publish Date - 2023-08-26T15:07:06+05:30
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ శనివారంనాడు శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రఖ్యాత నిగీన్ లేక్ లో పడవలో ప్రయాణించారు. నిగీన్ లేక్‌లోని హౌస్‌బోట్‌లో బస చేస్తున్న రాహుల్ గాంధీని ఆమె కలుసుకోనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శ్రీనగర్‌కు రాహుల్ గాంధీ శుక్రవారం వచ్చారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) శనివారంనాడు శ్రీనగర్ (Srinagar) చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రఖ్యాత నిగీన్ లేక్ (Nigeen Lake)లో పడవలో ప్రయాణించారు. నిగీన్ లేక్‌లోని హౌస్‌బోట్‌లో బస చేస్తున్న రాహుల్ గాంధీని ఆమె కలుసుకోనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శ్రీనగర్‌కు రాహుల్ గాంధీ శుక్రవారం వచ్చారు.
లడఖ్‌లో వారం రోజుల పర్యటన నుంచి శుక్రవారం శ్రీనగర్ చేరుకున్న రాహుల్‌ను సోనియాగాంధీ ఈరోజు కలుసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా వీరితో కలుస్తారు. రైనవారి ప్రాంతంలోని హోట్‌ల్‌లో వీరంతా బస చేసే అవకాశం ఉంది. ఈ హోటల్‌తో చాలాకాలంగా రాహుల్ కుంటుంబానికి అనుబంధం ఉందని చెబుతున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనేనని, కుటుంబ సభ్యులంతా కలుసుకోవడానికే పరిమితమని, పార్టీ నేతలతో ఎలాంటి సమావేశాలు ఉండవని పార్టీ నేత చెప్పారు.
రాహుల్ గాంధీ కేంద్ర పాలిత ప్రాంతమైన లఢఖ్‌లో గతవారం రోజులుగా ఉంటున్నారు. ఈ ప్రాంతంలోని పాంగాంగ్ లేక్, నుబ్రా వ్యాలీ, ఖర్‌డుంగ్లా టాప్, లమయూరు, జాంస్కర్ సహా పలు ప్రాంతాలను ఆయన దర్శించారు. కార్గిల్ చేరుకోవడానికి ముందు మోటార్ రైడ్ చేశారు. గత శుక్రవారం ఉదయం కార్గిల్‌లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ప్రసంగించిన అనంతరం శ్రీనగర్ చేరుకున్నారు. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ నుంచి లఢక్‌ను యూటీగా విడగొట్టారు. 370వ అధికరణను రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్ సైతం కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది.
Updated Date - 2023-08-26T15:07:06+05:30 IST