ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Special buses: నేటినుంచి దసరా స్పెషల్‌ బస్సులు..

ABN, First Publish Date - 2023-10-20T10:17:13+05:30

దసరా పండుగ సెలవులకు నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రాష్ట్ర రవాణా సంస్థ శుక్రవారం నుంచి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సెలవులకు నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రాష్ట్ర రవాణా సంస్థ శుక్రవారం నుంచి 1000 ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఆయుధపూజ, విజయదశమి సెలవులు, వారాంతం శని, ఆదివారాలు వరుసగా వస్తుండటంతో గురువారం నుంచే నగరం నుంచి వివిధ నగరాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. రైళ్లలో టికెట్లు లభించనివారంతా రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు, ఆమ్నీ బస్సులలో స్వంత ఊళ్లకు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా సంస్థ శుక్రవారం నుంచి 1000 ప్రత్యేక బస్సులను నడుపనుంది. కోయంబేడు, మధురవాయల్‌ బైపాస్‌, తాంబరం మెప్స్‌ బస్‌స్టేషన్‌ ప్రాంతాల నుంచి 2264 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. శుక్రవారం వివిధ నగరాల నుండి సుమారు 30 వేలమంది, చెన్నై నుండి 17 వేల మంది తమ స్వంత ఊర్లకు వెళ్లేందుకు టికెట్లు రిజర్వు చేసుకున్నట్లు చెప్పారు.

విమాన ఛార్జీలకు రెక్కలు... : ఇదిలా ఉండగా దసరా సెలవుల సందర్భంగా నగరంలో విమానఛార్జీలు యాభైశాతం వరకూ పెరిగాయి. ఈ మేరకు వివిధ విమానయాన సంస్థలు ముంబాయి, ఢిల్లీ, గోవా, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, హైదరాబాద్‌, బెంగళూరు(Hyderabad, Bangalore) తదితర నగరాలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీ కంటే యాభై శాతం అధికంగా వసూలు చేస్తున్నారు.

Updated Date - 2023-10-20T10:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising