Tamil Seers: తమిళ మఠాధిపతులకు ప్రత్యేక విమానం...టాప్ హోటల్లో వసతి, సౌకర్యాల కల్పన
ABN, First Publish Date - 2023-05-29T12:24:28+05:30
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో చారిత్రక రాజదండంతోపాటు తమిళనాడుకు చెందిన 19 మంది మఠాలకు చెందిన మఠాధిపతులు ఈ వేడుకలో అందరినీ ఆకర్షించారు....
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో చారిత్రక రాజదండంతోపాటు తమిళనాడుకు చెందిన 19 మంది మఠాలకు చెందిన మఠాధిపతులు ఈ వేడుకలో అందరినీ ఆకర్షించారు.ఈ వేడుక కోసం మఠాధిపతులను ప్రత్యేక విమానంలో కేంద్రం తీసుకువచ్చి వారికి ఢిల్లీలోని మూడు రోజుల పాటు వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేసింది.(Tamil Seers) రాబోయే రోజుల్లో తమిళ మఠాధిపతులకు మద్దతు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.మఠాధిపతులకు సహాయం చేయడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తులను కేటాయించింది, తమిళ భాష మాట్లాడే అధికారిని నియమించారు.19 మంది మఠాధిపతుల్లో ఆరుగురు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజదండాన్ని బహుకరించారు.
గణపతి హోమం, తమిళ కీర్తనలు,శ్లోకాలతో కూడిన వేడుకలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి రాజదండాన్ని ధర్మపురం, మదురై, తిరువావడ్తురై, కుండ్రకుడి, పేరూర్, వేలకురిచ్చి మఠాధిపతులు అందించారు.ధర్మానికి, స్వయం పాలనకు ప్రతీక అయిన సెంగోల్‌ను ప్రధాని మోదీ స్వయంగా కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో ఉంచారు.‘‘సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ మమ్మల్ని పిలిచి గౌరవించడం మా మఠాధిపతులను ఉత్సాహపర్చింది’’ అని ధర్మపురం మఠానికి సంబంధించిన సీనియర్ న్యాయవాది ఎం కార్తికేయ అన్నారు.(Centre Big Outreach To Tamil Seers) ‘‘1947వ సంవత్సరంలో ప్రధానమంత్రి నెహ్రూకి సెంగోల్‌ను అందించింది కేవలం ఒక మఠాధిపతి మాత్రమే, కానీ ఇప్పుడు రాజదండాన్ని మోదీకి ఆరుగురు మఠాధిపతులు కలిసి అందించారు. శైవ సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మేం చేస్తున్న కృషికి ఇది పెద్ద గుర్తింపు’’ ప్రధాన మఠాధిపతి సత్యజ్ఞాన మహదేవ అన్నారు.
ఇది కూడా చదవండి : Karnataka Cabinet allocation: సీఎం సిద్ధరామయ్య వద్దే ఆర్థికశాఖ...డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ
మఠాధిపతులకు రాజధానిలోని ఒక టాప్ హోటల్‌లో మూడు రోజుల పాటు బస ఏర్పాటు చేసి, వారికి సాత్విక ఆహారం అందజేశారు.మఠాధిపతులకు ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలాలు లేకుండా శాఖాహారం అందించారు. అక్కడ ఒక ప్రత్యేక క్యాటరర్‌ను ఏర్పాటు చేసి, ప్రతి మఠాధిపతిని విడివిడిగా సంప్రదించి వారు తినేందుకు వీలైన ఆహారాన్ని సిద్ధం చేశారు.ఉదాహరణకు ధర్మపురం మఠాధిపతి శతాబ్దాలుగా సూర్యాస్తమయానికి ముందు పూజ చేస్తారు.వారి ఆచారాలు దెబ్బతినకుండా ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2023-05-29T12:37:46+05:30 IST