ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Special logo: దీర్ఘకాలిక ప్రగతిపై ప్రత్యేక లోగో

ABN, First Publish Date - 2023-03-05T08:21:21+05:30

రాష్ట్ర దీర్ఘకాలిక ప్రగతిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. శనివారం సచివాలయంలో ప్రణాళిక, అభివృద్ధి వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అడయార్‌(చెన్నై): రాష్ట్ర దీర్ఘకాలిక ప్రగతిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. శనివారం సచివాలయంలో ప్రణాళిక, అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో 2030 సంవత్సరానికిగాను దీర్ఘకాలిక అభవృద్ధిని పూర్తి స్థాయిలో సాధించే లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వ విధి విధానాలు, నిర్ణయాలను బహిరంగంగా వ్యక్తపరిచేలా ముద్రించిన పుస్తకాలతో పాటు లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రితోపాటు ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ జె.జయరంజన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, ప్లానింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ శాఖ అడిషినల్‌ చీఫ్‌ సెక్రటరీ విక్రమ్‌ కపూర్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంత్రిత్వ శాఖ కమిషనర్‌ దారేస్‌ అహ్మద్‌, ప్లానింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ స్పెషల్‌ సెక్రటరీ రాజశేఖర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న దీర్ఘకాలిక ప్రగతి లక్ష్యాన్ని చేరేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా యువత, కంపెనీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, దీర్ఘకాలిక ప్రగతి కోసం కృషి చేసే ఔత్సాహికులు తదితరులతో నిరంతరం సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ విధానాన్ని వివరిసూ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రం నిర్దేశించుకున్న ప్రగతిని చేరుకునేందుకు ప్రభుత్వం వంద రకాలైన చర్యలు తీసుకోనుంది. దీర్ఘకాలిక ప్రగతి కోసం ఐదు ప్రధాన లక్ష్యాలైన ప్రజలు, అభివృద్ధి, శాంతిభద్రతలు, భూతాపం, శాంతిస్థాపన, సమైక్యతా విధానాలతో ముందుకుసాగేలా ప్రణాళికలు రూపొందించారు.

Updated Date - 2023-03-05T08:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising