Kerala : ప్రొఫెసర్ చేతిని నరికిన కేసులో ఆరుగురు పీఎఫ్ఐ సభ్యులు దోషులు : కోర్టు
ABN, First Publish Date - 2023-07-12T14:46:43+05:30
కేరళలోని ఓ ప్రొఫెసర్‌పై దాడి చేసి, ఆయన చేతిని నరికిన కేసులో ఆరుగురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) సభ్యులు దోషులని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఐదుగురు నిందితులు నిర్దోషులని ప్రకటించింది. 2010లో జరిగిన ఈ దారుణ సంఘటనపై నమోదైన కేసులో రెండో దశ విచారణ తర్వాత ఈ తీర్పును వెల్లడించింది.
కొచ్చి : కేరళలోని ఓ ప్రొఫెసర్‌పై దాడి చేసి, ఆయన చేతిని నరికిన కేసులో ఆరుగురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) సభ్యులు దోషులని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఐదుగురు నిందితులు నిర్దోషులని ప్రకటించింది. 2010లో జరిగిన ఈ దారుణ సంఘటనపై నమోదైన కేసులో రెండో దశ విచారణ తర్వాత ఈ తీర్పును వెల్లడించింది. దోషులకు శిక్షలను గురువారం మధ్యాహ్నం ఖరారు చేస్తుంది. పీఎఫ్ఐపై ప్రస్తుతం నిషేధం అమలవుతోంది.
కేరళలోని తొడుపుజలో ఉన్న న్యూమన్ కాలేజీలో మలయాళం ప్రొఫెసర్‌గా పని చేస్తున్న టీజే జోసఫ్‌పై 2010 జూలై 4న దాడి జరిగింది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్నాకుళం జిల్లాలోని మువట్టుపుజలో ఉన్న చర్చిలో ఆదివారం ప్రార్థనలకు హాజరై, అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా, ఆయనపై దుండగులు దాడి చేశారు. ఆయన కుడి అరచేతిపైనా, కాలుపైనా కత్తితో పొడిచి, తీవ్రంగా గాయపరచారు. దాడికి పాల్పడినవారు పీఎఫ్ఐ సభ్యులని గుర్తించారు.
ఈ కేసును ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు విచారించింది. మొదటి దశలో 31 మందిని విచారించి, వీరిలో పది మందికి ఒక్కొక్కరికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2015 ఏప్రిల్‌లో తీర్పు చెప్పింది. మిగిలినవారిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. రెండో దశలో ఆరుగురు దోషులని కోర్టు బుధవారం నిర్థరించింది, సాజల్, నాసిర్, నజీబ్, నౌషాద్, మొయిదీన్‌కుంజు, అయూబ్ దోషులని తీర్పు చెప్పింది. వీరికి శిక్షలను గురువారం మధ్యాహ్నం ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
Former Minister: ఆదాయానికి మించి ఆస్తులు.. మాజీ మంత్రిపై ఛార్జీషీటు దాఖలు
Collegium system : కొలీజియం వ్యవస్థపై సీజేఐ చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు
Updated Date - 2023-07-12T14:46:43+05:30 IST