Special trains: కాచిగూడ, సికింద్రాబాద్‌ల నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్లు
ABN, First Publish Date - 2023-12-10T10:57:05+05:30
కాచిగూడ, సికింద్రాబాద్(Kachiguda, Secunderabad)ల నుంచి కొల్లంకు ఈనెల 11వ తేది నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు
ఐసిఎఫ్(చెన్నై): కాచిగూడ, సికింద్రాబాద్(Kachiguda, Secunderabad)ల నుంచి కొల్లంకు ఈనెల 11వ తేది నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. కాచిగూడ నుంచి 11వ తేది రాత్రి 11.45 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు 13వ తేది ఉదయం 5.30 గంటలకు కొల్లం చేరుకుం టుంది. ఈ రైలు కొల్లం నుంచి 13వ తేది ఉదయం 10.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు కాచిగూడ నుంచి మెహబూబ్‌నగర్, శ్రీరాంనగర్, రేణిగుంట, తిరుపతి(Renigunta, Tirupati), పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడు, ఎర్నాకుళం మీదుగా కొల్లం చేరుకుంటుంది. అదే విధంగా సికింద్రాబాద్(Secunderabad) నుంచి 13వ తేది సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు మరుసటిరోజు రాత్రి 11.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఈ రైలు కొల్లం నుంచి ఈనెల 15వ తేది వేకువజామున 2.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్ల రిజర్వేషన్ శనివారం ఉదయం ప్రారంభమైంది.
Updated Date - 2023-12-10T10:57:07+05:30 IST