Special trains: వైజాగ్, శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్లు
ABN, First Publish Date - 2023-11-24T10:16:17+05:30
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు - కొలం్ల - శ్రీకాకుళం, విశాఖపట్టణం - కొల్లం - విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు
పెరంబూర్(చెన్నై): అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు - కొలం్ల - శ్రీకాకుళం, విశాఖపట్టణం - కొల్లం - విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
- నెం.08537 శ్రీకాకుళం రోడ్డు - కొల్లం(Srikakulam Road - Kollam) ప్రత్యేక చార్జీ రైలు ఈనెల 25, డిసెంబరు 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 11 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, నెం.08538 కొల్లం - శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక చార్జీ రైలు ఈ నెల 26, డిసెంబరు 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 6.35 గంటలకు కొల్లంలో బయల్దేరి మరుసటిరోజు వేకువజామున 2 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది.
- నెం.08539 విశాఖపట్టణం - కొల్లం ప్రత్యేక సూపర్ ఫాస్ట్ చార్జీ రైలు ఈనెల 29, డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో ఉదయం 8.20 గంటలకు విశాఖపట్టణంలో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, నెం.08549: కొల్లం - విశాఖపట్టణం ప్రత్యేక సూపర్ ఫాస్ట్ చార్జీ రైలు ఈనెల 30, డిసెంబరు 7, 14, 21, 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది.
Updated Date - 2023-11-24T10:16:19+05:30 IST