ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sri Lanka : భారత్‌పై శ్రీలంక ప్రశంసలు

ABN, First Publish Date - 2023-03-08T20:25:26+05:30

మునుపెన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకకు ఇతర దేశాలేవీ చేయనంత గొప్ప సహాయాన్ని భారత దేశం చేసిందని

India and Sri Lanka
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : మునుపెన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకకు ఇతర దేశాలేవీ చేయనంత గొప్ప సహాయాన్ని భారత దేశం చేసిందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రి (Ali Sabry) కొనియాడారు. కష్టకాలంలోనే నిజమైన స్నేహితులెవరో తెలుస్తుందన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నపుడు భారత దేశం తమకు అండగా నిలిచిందని చెప్పారు. అవసరంలో స్నేహంగా ఉన్నవారే నిజమైన స్నేహితులని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అండగా నిలవడం కోసం భారత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని, అందువల్ల భారత దేశానికి తాము ఎంతో కృతజ్ఞులమని తెలిపారు.

శ్రీలంక రుణాల ఊబిలో కూరుకుపోకుండా కాపాడటానికి భారత దేశం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఇతర దేశాలు చేసిన సాయం కన్నా చాలా ఎక్కువ అని అలీ సబ్రి తెలిపారు. శ్రీలంకకు సాయపడటానికి భారతీయులు కూడా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. రైసినా డయలాగ్ ‘ఐడియాస్ పాడ్’ (Ideas Pod)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మన దేశం దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక సాయం చేసింది. దీనిలో కొంత రుణం కూడా ఉంది. ఆహారం, ఇంధనం వంటివాటిని కొనడానికి తగిన ఏర్పాట్లు చేసింది.

ఇవి కూడా చదవండి :

Hinduphobia : అమెరికాలో హిందూ ఫోబియాపై ‘పాంచజన్య’ ఆగ్రహం

America : వయసు 75 ఏళ్లు పైబడితే ఆ పరీక్షలు చేయించాలా?... జో బైడెన్ సతీమణి సమాధానం ఇదే...

Updated Date - 2023-03-08T20:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising