ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gorakhpur-Lucknow: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు

ABN, First Publish Date - 2023-07-11T14:11:13+05:30

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లు రువ్విన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గొరఖ్‌పూర్-లక్నో సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారంనాడు రాళ్లు విసిరారు. దీంతో రెండు కోచ్‌ల అద్దాలు దెబ్బతిన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)పై మరోసారి రాళ్లు రువ్విన ఘటన (Stone pelted) ఉత్తరప్రదేశ్‌లో (Uttar pradesh) చోటుచేసుకుంది. గొరఖ్‌పూర్-లక్నో సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారంనాడు రాళ్లు విసిరారు. 550 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ రైలు శనివారం మినహా వారంలో ఆరు రోజులు రాకపోకలు సాగిస్తుంది.

రాళ్లు రువ్విన ఘటనలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నెంబర్ C1, C3 ఎగ్జిక్యూటివ్ కోచ్ అద్దాలు పగిలాయి. అయితే, ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. గతంలోనూ పలు రూట్లలో ఏడుసార్లు ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. జూలై 5న కర్ణాటకలోని చిక్కమగళూరులోని కదూర్-బీరూర్ మధ్య బెంగళూరు-ధార్వాడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై అగంతకులు రాళ్లు రువ్వారు. C5 కోచ్ నెంబర్ 43, 44, EC-1 కోచ్ టాయిలెట్‍పై రాళ్లు రువ్వడంతో ఔటర్ గ్లాసులు దెబ్బతిన్నాయి. ఎవరూ గాయపడలేదు.

Updated Date - 2023-07-11T14:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising