ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India Vs China : ‘అంతా బాగుంది’ అంటున్న చైనాకు దీటుగా బదులిచ్చిన జైశంకర్

ABN, First Publish Date - 2023-04-29T16:48:36+05:30

భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి సామాన్యంగా నిలకడగా ఉందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం చేసిన ప్రకటనపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం

Subrahmanian Jaishankar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి సామాన్యంగా నిలకడగా ఉందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం చేసిన ప్రకటనపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) శనివారం ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు వరుస తప్పి విపరీతంగా ఉన్నట్లు తెలిపారు. సరిహద్దు నిర్వహణ ఒప్పందాలను చైనా ఉల్లంఘించడమే దీనికి కారణమని తెలిపారు.

శాంటో డొమింగోలో తొలిసారి అధికారికంగా పర్యటిస్తున్న సుబ్రహ్మణ్యం జైశంకర్ మాట్లాడుతూ, ఫలానా వర్గానికి పరిమితం కావాలని కోరుకోకుండా, అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు వృద్ధి చెందాలని భారత దేశం కోరుకుంటోందన్నారు. అమెరికా, యూరోప్, రష్యా, జపాన్ వంటి దేశాలతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలని భారత్ కోరుకుంటోందన్నారు. సరిహద్దు వివాదం వల్ల చైనా ప్రత్యేక వర్గంలోకి వెళ్లిందని చెప్పారు. ప్రస్తుతం చైనాతో సంబంధాలు విపరీత స్వభావంతో ఉన్నాయని చెప్పారు. సరిహద్దు నిర్వహణ ఒప్పందాలను చైనా ఉల్లంఘించడమే దీనికి కారణమని చెప్పారు.

ఈ ప్రాంతంలో నాటకీయంగా కనెక్టివిటీ, కాంటాక్ట్స్, కోఆపరేషన్ విస్తరణ జరుగుతుండటాన్ని భారత దేశం గమనించిందని డొమినికన్ రిపబ్లిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం జైశంకర్ శుక్రవారం చెప్పారు. క్రాస్-బోర్డర్ టెర్రరిజం దృష్ట్యా పాకిస్థాన్ ఓ మినహాయింపు అని జైశంకర్ చెప్పారు.

షాంఘై సహకార సంఘం (SCO) సమావేశాల సందర్భంగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు ఇటీవల భారత దేశంలో రెండు రోజులపాటు పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)తో కూడా సమావేశమయ్యారు. రాజ్‌నాథ్ కూడా సరిహద్దు సమస్య పరిష్కారమైతేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Mukhtar Ansari : ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష

Karnataka Elections: నాకు లెక్కలు బాగా తెలుసు..141 సీట్లు గెలుస్తాం : డీకే

Updated Date - 2023-04-29T16:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising