ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Cour : జ్ఞానవాపి శివలింగం కార్బన్ డేటింగ్.. మసీదు కమిటీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ..

ABN, First Publish Date - 2023-05-18T13:45:57+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో కనిపించిన శివలింగం వయసును నిర్థరించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు

Gyanvapi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో కనిపించిన శివలింగం వయసును నిర్థరించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రాఫిక్ సర్వేలో ఈ శివలింగం బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఇది శివలింగం కాదని, ఫౌంటెన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది.

ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ తరపున సీనియర్ అడ్వకేట్ హుజెఫా అహ్మది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) ధర్మాసనాన్ని కోరారు. అపీలు పెండింగ్‌లో ఉండగా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, తీర్పు రిజర్వు అయి, పెండింగ్‌‌లో ఉన్నపుడు కార్బన్ డేటింగ్ కోసం మరో దరఖాస్తు దాఖలు చేశారని చెప్పారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపేందుకు సీజేఐ మొగ్గు చూపారు. కానీ అదే రోజు సైంటిఫిక్ సర్వే ప్రారంభమవుతుందని హుజెఫా చెప్పడంతో, దీనిపై శుక్రవారం (మే 19న) విచారణ జరుపుతామని చెప్పారు.

అంతకుముందు హిందూ పక్షం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై కెవియట్ దాఖలు చేసింది. హైకోర్టు మే 12న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లపై తమ వాదన వినకుండా ఎటువంటి ఆదేశాలను జారీ చేయరాదని కోరింది.

హైకోర్టు ఏం చెప్పిందంటే..

లక్ష్మీ దేవి, మరి కొందరు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు మే 12న ఆదేశాలు జారీ చేసింది. 2022 అక్టోబరు 14న క్రింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. మే 22న వారణాసి జిల్లా కోర్టులో హాజరుకావాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో కనిపించిన శివలింగం వయసును శాస్త్రీయంగా నిర్థరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీని కోసం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా కార్బన్ డేటింగ్ కూడా నిర్వహించాలని తెలిపింది.

ఈ శివ లింగం వయసును నిర్థరించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు 2022 అక్టోబరు 14న కొట్టివేసింది. ఈ తీర్పును హైకోర్టు కొట్టివేస్తూ, హిందువుల పిటిషన్‌పై చట్ట ప్రకారం వ్యవహరించాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. గత ఏడాది సర్వేలో బయటపడిన నిర్మాణం యొక్క వయసును సైంటిఫిక్‌గా నిర్థరించాలని హిందూ భక్తులు ఈ పిటిషన్‌లో కోరారు.

ఇవి కూడా చదవండి :

Karnataka : కర్ణాటక కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం సాయంత్రం 7 గంటలకు : డీకే

Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్యకే!

Updated Date - 2023-05-18T13:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising