ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court : అతిక్-అష్రఫ్ హత్యలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

ABN, First Publish Date - 2023-04-18T12:13:04+05:30

ఉత్తర ప్రదేశ్‌ )లో 2017 నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ

Ashraf, Atiq
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh)లో 2017 నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. అడ్వకేట్ విశాల్ తివారీ (Vishal Tiwari) దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ జరుపుతామని తెలిపింది. గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ హత్యలను కూడా ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు వీరిద్దరూ పోలీస్ కస్టడీలో ఉండగా ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 15న హత్యకు గురయ్యారని తెలిపారు.

అతిక్, అష్రఫ్‌లను శనివారం రాత్రి మెడికల్ చెక్అప్ కోసం పోలీసు బందోబస్తు మధ్య ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. ఆ కళాశాల వద్ద మీడియాతో వారిద్దరూ మాట్లాడేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు వారిపై కాల్పులు జరిపి, హత్య చేశారు. పోలీసులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఈ దారుణం జరిగింది. ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం వెంటనే స్పందించింది. దాదాపు 17 మంది పోలీసులను సస్పెండ్ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తునకు ఆదేశించింది.

విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Chief Justice DY Chandrachud) విచారణకు స్వీకరించారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని తివారీ కోరారు. 2017 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 183 ఎన్‌కౌంటర్లు జరిగాయని తెలిపారు. అతిక్, అష్రఫ్ హత్యలపై స్వతంత్ర నిపుణుల కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని కోరారు.

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో 2017 నుంచి ఇప్పటి వరకు 183 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు ఉత్తర ప్రదేశ్ శాంతిభద్రతల విభాగం ప్రత్యేక డీజీపీ ప్రకటించారని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, చట్టబద్ధ పాలనను కాపాడేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అతిక్, అష్రఫ్‌ల హత్యలపై కూడా ఈ కమిటీ చేత దర్యాప్తు చేయించాలని కోరారు.

అతిక్ అహ్మద్ కుమారుడు అసద్‌ కూడా ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఝాన్సీలో ఆయనను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసు బృందంపై ఆయన కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Ajit Pawar: ఎన్సీపీకి అజిత్ పవార్ బిగ్ షాక్...30మంది ఎమ్మెల్యేలతో బీజేపీ తీర్థం?

Nepal: అన్నపూర్ణ పర్వతం నుంచి భారతీయ పర్వతారోహకుడి అదృశ్యం

Updated Date - 2023-04-18T12:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising