ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court : విద్వేష ప్రసంగాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం..

ABN, First Publish Date - 2023-04-28T18:08:01+05:30

విద్వేషపూరిత ప్రసంగాల (Hate Speeches)పై తక్షణం స్వయంగా కేసులు నమోదు చేయాలని, కేసుల నమోదులో ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కారంగా

Supreme Court
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : విద్వేషపూరిత ప్రసంగాల (Hate Speeches)పై తక్షణమే స్వయంగా కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. కేసుల నమోదులో ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఎవరైనా విద్వేషపూరితంగా ప్రసంగించినపుడు వారిపై ఇతరులు స్పందించి, ఫిర్యాదు చేయకపోయినప్పటికీ పోలీసులు స్వయంగా కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. 2022లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల పోలీసులకు ఈ అంశంపై ఇచ్చిన ఆదేశాలను శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపజేస్తున్నట్టు పేర్కొంది.

విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. దేశంలోని లౌకికవాద వ్యవస్థను ప్రభావితం చేసే సత్తా విద్వేషపూరిత ప్రసంగాలకు ఉందని, ఇది చాలా తీవ్రమైన నేరమని తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగం చేసినవారిపై చర్యలు తీసుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై అంతకుముందు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాజ్యాంగ ప్రవేశికలో తెలిపిన దేశ లౌకికవాద లక్షణాన్ని కాపాడటం కోసం, విద్వేష ప్రసంగం చేసినవారి మతం ఏదైనప్పటికీ, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇందుకు అనుగుణంగా ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే ప్రతి జిల్లాకు ఒకరిని నియమించాలని ధర్మాసనం సూచించింది. విద్వేష ప్రసంగాలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించడం కోసం ప్రత్యేకంగా ఓ విధానాన్ని రూపొందించాలని పిటిషనర్లు కోరారు.

విద్వేషపూరితంగా మాట్లాడినందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, మరికొందరిపై కేసులు నమోదు చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే జస్టిస్ జోసఫ్ స్పందిస్తూ, సెక్షన్ 156(3) ప్రకారం కేసు నమోదు చేయాలంటే అనుమతి అవసరమని మేజిస్ట్రేట్, హైకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారన్నారు. వారికి ఫలానా పార్టీతో సంబంధం ఉండదన్నారు. వారి దృష్టిలో ఉండేది కేవలం భారత దేశ రాజ్యాంగమేనని తెలిపారు. విద్వేష ప్రసంగాలపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్న ఫిర్యాదులను విశాల ప్రజా హితం దృష్ట్యా, చట్టబద్ధ పాలన అమలయ్యేలా చేయడం కోసం విచారణకు చేపడుతున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ మే 12న జరుగుతుంది.

ఇవి కూడా చదవండి :

Karnataka Elections: సోనియా విషకన్య ... బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు

India Vs China : చైనాకు తెగేసి చెప్పిన భారత్

Updated Date - 2023-04-28T18:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising