ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adani-Hindenburg row : రూ. లక్షల కోట్లు నష్టమా?.. సెబీ ఏం చేస్తోంది? : సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2023-02-10T17:59:11+05:30

అదానీ గ్రూప్ (Adani Group)లో పెట్టుబడి పెట్టినవారు అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక నేపథ్యంలో

Gautam Adani , Supreme Court
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ (Adani Group)లో పెట్టుబడి పెట్టినవారు అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక నేపథ్యంలో భారీ నష్టాల్లో కూరుకుపోయారని, మదుపరులను కాపాడవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ అంశంపై దేశంలో అమలవుతున్న నియంత్రణ వ్యవస్థల గురించి, తాజా పరిణామాల నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ ప్రమాణ పత్రాన్ని (అఫిడవిట్‌ను) దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)ను ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది. న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PILs)పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

అదానీ గ్రూప్‌పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ పన్నిన కుట్రపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. అదానీ స్టాక్స్‌ను హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్ చేసిందని, ఫలితంగా పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్పందిస్తూ, హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో మార్కెట్ పతనమవడం వెనుక కారణాలపై నివేదికను సోమవారంనాటికి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెబీని ఆదేశించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు నియంత్రణ నిబంధనావళిని ఏ విధంగా పటిష్టపరచవచ్చునో సలహాలు ఇవ్వాలని కోరింది. కేంద్రం, సెబీ (SEBI)లను సంప్రదించి ఈ నివేదికను రూపొందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. సెక్యూరిటీ మార్కెట్లకు వర్తించే చట్టాలు, నియంత్రణ శాసనాలలో తగిన సవరణలను సిఫారసు చేసేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది.

ఈ సందర్భంగా ధర్మాసనం ఆచితూచి మాట్లాడింది. ‘‘మేం ఏం చెప్పినా మార్కెట్ సెంటిమెంట్, పెట్టుబడిదారుల ఆత్మవిశ్వాసం ప్రభావితం కావచ్చు’’నని పేర్కొంది. పెట్టుబడిదారులను కాపాడటానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని తెలిపింది. మూలధనం ప్రవాహం నిరంతరాయంగా జరుగుతోందని, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారని పేర్కొంది.

‘‘భారతీయ మదుపరుల ప్రయోజనాలను ఏవిధంగా కాపాడాలనే విషయం మమ్మల్ని నిజంగా బాధిస్తోంది. పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టపోయారని పిటిషనర్లు చెప్తున్నారు’’ అని పేర్కొంది. సెబీని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా నిరోధించడానికి తగిన విధంగా చట్టపరమైన నిబంధనలను సవరించేందుకు సూచనలు చేయడానికి ఓ నిపుణుల కమిటీని నియమించడంపై ఆలోచిద్దామా? అని అడిగింది. ప్రస్తుతం అమలవుతున్న నియంత్రణ యంత్రాంగం, తాజాగా చేపట్టిన చర్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొంది. నియంత్రణ యంత్రాంగాన్ని తగిన విధంగా బలోపేతం చేయవలసిన అవసరం ఉందని పేర్కొంది. పెట్టుబడిదారుల ప్రయోజనాల దృష్ట్యా, సెక్యూరిటీ మార్కెట్ నిలకడగా అభివృద్ధి చెందడం కోసం నియంత్రణ నిబంధనావళిని బలోపేతం చేయవలసిన అవసరం ఉందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఓ కమిటీని ఏర్పాటు చేయవచ్చునని తెలిపింది.

పిటిషనర్లు తమ వాదనలో, హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల కేవలం మన దేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌ కుదుపునకు గురికావడం మాత్రమే కాకుండా, మన దేశంలోని వ్యాపారవేత్తలు అమలు చేసే వ్యాపార పద్ధతులు ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయని, ఈ పరిస్థితికి కారణమైన హిండెన్‌బర్గ్‌పై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిటీ చేత న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎటువంటి నియంత్రణలు లేకుండా కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇస్తుండటం వల్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, భారీ కార్పొరేట్ సంస్థలకు రూ.500 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేయడంపై పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా, అదానీ గ్రూప్ వివాదం పార్లమెంటులో కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, బీఆర్ఎస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పట్టుబడుతున్నాయి.

Updated Date - 2023-02-10T18:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising