ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maoist links case : ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్

ABN, First Publish Date - 2023-04-19T12:36:43+05:30

ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (former Delhi University Professor G N Saibaba)కు బుధవారం సుప్రీంకోర్టులో భారీ

Supreme Court, GN Saibaba
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (former Delhi University Professor G N Saibaba)కు బుధవారం సుప్రీంకోర్టు (Supeme Court)లో భారీ షాక్ తగిలింది. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో ఆయన నిర్దోషి అని బోంబే హైకోర్టు చెప్పిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కేసులో పసను బట్టి తాజాగా మళ్లీ విచారణ జరపాలని, విచారణను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

మావోయిస్టులతో సంబంధాలున్నాయని నిర్థరిస్తూ క్రింది కోర్టు సాయిబాబాకు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. బోంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా తీర్పు చెప్పి, ఆయనకు క్రింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును ఎన్ఐఏ (National Investigation Agency) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్త, నాలుగు నెలల్లో మెరిట్స్ ఆధారంగా మళ్లీ సాయిబాబా కేసును విచారించాలని హైకోర్టును ఆదేశించింది.

సాయిబాబాపై నమోదైన కేసు పూర్వాపరాలివి..

మావోయిస్టులతో లింకులున్నాయంటూ మహారాష్ట్ర పోలీసులు 2013లో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా (52)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2014 మే 9న సాయిబాబాను ఢిల్లీలో అరెస్టు చేశారు. కోర్టు ఆయన్ను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. అప్పటికే ఈ వ్యవహారంలో మరో ఐదుగురు.. మహేశ్‌ టిర్కీ, హేమ్‌ కేశవదత్త మిశ్రా, ప్రశాంత్‌ రాహి, విజయ్‌ నాన్‌ టిర్కీ, పాండు పొరా నరోతే జైల్లో ఉన్నారు. మావోయిస్టులతో లింకులతో పాటు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), భారత శిక్షాస్మృతి (IPC) కింద గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు ఈ ఆరుగురిపైనా అభియోగాలు నమోదుచేసింది. ఆ తర్వాత సాయిబాబాను ప్రాసిక్యూట్‌ చేసేందుకు శాంక్షనింగ్‌ అథారిటీ ఆమోదం తెలిపింది. 2015 అక్టోబరు 31న పోలీసులు అనుబంధ చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం 2017 మార్చి 3న వారిని కోర్టు దోషులుగా ప్రకటించింది. సాయిబాబా సహా ఐదుగురికి జీవిత ఖైదు, ఒకరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఆరుగురూ అదే ఏడాది మార్చి 29న తమకు శిక్ష విధింపును ముంబై హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ ముందు సవాల్‌ చేశారు. సాయిబాబాకు సెషన్స్‌ కోర్టు విధించిన జీవిత ఖైదు, జైలు శిక్షను హైకోర్టు కొట్టివేసింది. బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. తాజాగా.. ప్రొఫెసర్ సాయిబాబాను నిర్ధోషిగా ప్రకటిస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి :

Karnataka Election: మాజీ ఎమ్మెల్యే అనిల్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పి జేడీ(ఎస్)లో చేరిక

Karnataka Polls : స్వతంత్ర అభ్యర్థి డిపాజిట్ రూ.10 వేలు చెల్లించిన తీరు అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది!

Updated Date - 2023-04-19T12:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising