ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court : టీవీల్లో విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-03-29T20:37:00+05:30

రాజకీయాలతో మతాన్ని కలపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి హెచ్చరించింది.

Supreme Court
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : రాజకీయాలతో మతాన్ని కలపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి హెచ్చరించింది. ప్రధాన జీవన స్రవంతిలో లేని శక్తులు ప్రతి రోజూ టీవీలు, ఇతర బహిరంగ వేదికలపై ఇతరులను దూషిస్తూ, చులకన చేస్తూ ప్రసంగాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్వేష ప్రసంగాల (Hate Speeches)ను నియంత్రించాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. విద్వేష ప్రసంగాలు అత్యంత అనైతికమైనవని, క్రూరమైనవని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయంగా, నిస్సత్తువగా మారిపోయాయని పేర్కొంది. విద్వేష ప్రసంగాలు చేసేవారిపై సకాలంలో చర్యలు తీసుకోలేకపోతున్నాయని వ్యాఖ్యానించింది. మతం, రాజకీయాలు వేరుపడినపుడే విద్వేష ప్రసంగాలు ఆగుతాయని తెలిపింది.

జస్టిస్ జోసఫ్ మాట్లాడుతూ, రాజకీయ నాయకులు మతాన్ని వాడుకోవడం మానేస్తే, ఇదంతా ఆగిపోతుందన్నారు. ఇటీవల తాము ఇచ్చిన తీర్పులో మతంతో రాజకీయాలను కలపడం ప్రజాస్వామ్యానికి అపాయకరమని చెప్పామన్నారు.

జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పాయిలను ప్రస్తావించారు. మనం ఎక్కడికి పోతున్నామని ప్రశ్నించారు. నెహ్రూ, వాజ్‌పాయి వంటి వక్తలు మనకు ఉన్నారన్నారు. వారి మాటలను వినేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారన్నారు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి చిల్లర శక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని మమ్మల్ని అడుగుతున్నారన్నారు. రాజ్యం ముఖ్యమని, అది సకాలంలో పని చేయడం లేదని అన్నారు. ‘‘మేం చర్యలు తీసుకోవాలని మీరు మమ్మల్ని అడిగితే, మనకు రాజ్యం ఎందుకు? అని మేం అంటామ’’న్నారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొందరు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలను ఈ కేసుకు పిటిషనర్ జోడించాలన్నారు. ‘‘మీకు సమానత్వం కావాలంటే, బ్రాహ్మణులందరినీ చంపేయాలి’’ అని డీఎంకే నేత ఒకరు అన్నారని తెలిపారు. ఓ ప్రముఖ వ్యక్తి ఈ మాటలు చెప్పినందువల్ల , విద్వేషపూరిత ప్రసంగాన్ని క్షమించకూడదని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

India Vs China : ఎస్‌సీఓ సదస్సులో చైనాకు భారత్ షాక్!

Summit For Democracy : దేశంలో ప్రజాస్వామ్యంపై కుండ బద్దలు కొట్టిన మోదీ

Updated Date - 2023-03-29T20:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising