ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Muslim quota : కర్ణాటకలో ముస్లిం కోటా రద్దు.. బీజేపీపై స్టాలిన్ ఆగ్రహం..

ABN, First Publish Date - 2023-05-03T16:55:48+05:30

కర్ణాటకలో ముస్లింలకు ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను రద్దు చేయడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Amit Shah , MK Stallin
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : కర్ణాటకలో ముస్లింలకు ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను రద్దు చేయడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union home minister Amit Shah) చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (Tamil Nadu chief minister MK Stalin) తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం ప్రకారం మన దేశం లౌకికవాద దేశమని, కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేయడం సరికాదని అన్నారు.

స్టాలిన్ ప్రతి నెలా నిర్వహించే ‘మీలో ఒకడిని’ కార్యక్రమంలో మాట్లాడుతూ, బీజేపీ విద్వేష ఎజెండాను రుద్దుతోందని మండిపడ్డారు. మైనారిటీల పట్ల బీజేపీ శత్రుత్వ వైఖరి బయటపడుతోందన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసమే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీకి సోషల్ మీడియా, కొన్ని న్యూస్ మీడియా ఆర్గనైజేషన్లు సహకరిస్తున్నాయన్నారు. ముస్లింలపై విషం చిమ్మడం వల్ల హిందువులు సంతృప్తి చెందుతారని బీజేపీ నేతలు నమ్ముతున్నారన్నారు. కానీ అది నిజం కాదన్నారు. బీజేపీకి ఓటు వేయని అత్యధికుల్లో హిందువులు కూడా ఉన్నారన్నారు. ప్రశాంతత, సోదరభావాలను వీరు కోరుకుంటారన్నారు. బీజేపీ ఓ వర్గం ప్రజలపై విద్వేషపూరిత ఎజెండాను రుద్దుతోందని, మెజారిటీ ప్రజల సెంటిమెంట్ అని ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మార్చి నెలలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసింది. వారికి ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను వీరశైవ-లింగాయత్‌లు, ఒక్కళిగలకు చెరొక 2 శాతం చొప్పున పంచిపెట్టింది. ఆర్థికంగా బలహీన వర్గాల కేటగిరీలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది.

అమిత్ షా సోమవారం కర్ణాటకలో బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ఓబీసీ జాబితాలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసిన రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మత ప్రాతిపదికపై రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

MeToo Protest : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఆరోపణలు

Karnataka Polls : కర్ణాటకలో చెట్లకు కరెన్సీ కట్టల పంట.. ఆశ్చర్యపోతున్న ఐటీ అధికారులు..

Updated Date - 2023-05-03T16:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising