Tamilnadu: డీఎంకే నేతపై పోలీసులకు గవర్నర్ కార్యాలయం ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-01-14T16:44:57+05:30

డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను తమిళనాడు గవర్నర్ కార్యాలయం సీరియస్‌గా తీసుకుంది. కృష్ణమూర్తిపై.. క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ

Tamilnadu: డీఎంకే నేతపై పోలీసులకు గవర్నర్ కార్యాలయం ఫిర్యాదు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి (Shivaji Krishnamurthy) చేసిన వ్యాఖ్యలను తమిళనాడు గవర్నర్ కార్యాలయం సీరియస్‌గా తీసుకుంది. కృష్ణమూర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ పోలీసులకు శనివారంనాడు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi)పై పరుష పదజాలంతో కించపరచే వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు చెన్నై కమిషనర్ ఆఫ్ పోలీస్ (CP)కి ఒక లేఖ రాశారు. తమిళనాడు గవర్నర్‌పై కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో రాజ్‌భవన్ ఈ చర్యకు దిగింది.

గౌరవ తమిళనాడు గవర్నర్‌ను కించపరచే విధంగా, బెదిరింపులతో కూడిన పదజాలాన్ని డీఎంకే సభ్యుడు వాడినట్టు సీపీకి రాసిన లేఖలో గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ తెలిపారు. డీఎంకే నేత ప్రసంగం 1970, ఐపీసీ పీనల్ కోడ్ సెక్షన్ 124 కిందకు వస్తుందని, దీనికి తోడు సంబంధిత సెక్షన్లను కూడా పరిగణనలోకి తీసుకుని సాధ్యమైనంత త్వరగా ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

అరెస్టు చేయండి: బీజేపీ డిమాండ్

గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీ కృష్ణమూర్తిపై చర్యల విషయంలో డీఎంకే ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర యూనిట్ ప్రశ్నించింది. కృష్ణమూర్తి ప్రసంగం అన్ని ప్రసార మాధ్యమాలలోనూ వచ్చిందని, దీనిపై చెన్నై పోలీసులు చర్య తీసుకోవాలని బీజేపీ నేత నారాయణ తిరుపతి డిమాండ్ చేశారు. డీఎంకే నేతను తక్షణం అరెస్టు చేసి జైలుకు పంపాలని, సీఎం తక్షణం ఇందుకు ఆదేశించాలని అన్నారు. ఇంతజరుగుతున్నా డీఎంకే నేతపై చర్యలు తీసుకోలేదంటే తమిళనాడు సీఎం స్టాలిన్ ఆశీస్సులు ఆయనకు ఉన్నట్టు భావించాల్సి వస్తుందన్నారు. దీని వెనుక రహస్య ఎజెండా ఉందనే అనుమానం కూడా కలుగుతోందని చెప్పారు.

శివాజీ కృష్ణమూర్తి ఏమన్నారు?

అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొందరు నేతల పేర్లు, కొన్ని పేరాలు చదవకుండా గవర్నర్ వ్యవహరించడాన్ని డీఎంకే నేత కృష్ణమూర్తి ఒక ర్యాలీలో తప్పుపట్టారు. ''ఆయనను (గవర్నర్‌ను) ఏమీ అనవద్దని సీఎం చెప్పారు. ఆయన స్పీచ్ ఉన్నది ఉన్నట్టు చదవి ఉండే ఆయన పాదాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి స్వాగతం పలికేవాళ్లం. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే మీరు (గవర్నర్) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగాన్ని మా పూర్వీకుడైన అంబేడ్కర్ రచించారు. మీకు ఆయన పేరు చెప్పడం ఇష్టం లేకపోతే కశ్మీర్‌కు వెళ్లిపోండి. మేము టెర్రరిస్టులను పంపుతాం, అప్పుడు వాళ్లే మిమ్మల్ని కాల్చేస్తారు'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-01-14T16:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising