ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamilnadu-Sri lanka Ferry Service: ఎట్టకేలకు తమిళనాడు, శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీస్ షురూ..

ABN, First Publish Date - 2023-10-14T18:11:47+05:30

తమిళనాడు తూర్పు ప్రాంతంలోని నాగపట్నం నుంచి శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని కంకేసాంతురై మధ్య సముద్ర మార్గం ద్వారా ఇంటర్నేషనల్, హైస్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్‌ (HSC) చెరియపాని శనివారంనాడు ప్రారంభమైంది. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ సముద్ర మార్గ ప్రయాణాన్ని పునరుద్ధరించడం విశేషం.

చెన్నై: పొరుగు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పొంపొందించే దిశగా మరో ముందడుగు పడింది. తమిళనాడు (Tamilnadu) తూర్పు ప్రాంతంలోని నాగపట్నం (Nagapapattinam) నుంచి శ్రీలంక (Sri lanka) ఉత్తర ప్రాంతంలోని కంకేసాంతురై (Kankesanthurai) మధ్య సముద్ర మార్గం ద్వారా ఇంటర్నేషనల్, హైస్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్‌ (HSC) చెరియపాని (Cheriyapani) శనివారంనాడు ప్రారంభమైంది. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ సముద్ర మార్గ ప్రయాణాన్ని పునరుద్ధరించడం విశేషం. నాగపట్నం పోర్ట్ వద్ద ఈ ఫెర్రీ సర్వీసును కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, తమిళనాడు ప్రజాపనులు, హైవేస్, మైనర్ పోర్ట్స్ మంత్రి ఈవీ వేలు జెండా ఊపి ప్రారంభించారు.


నాగపట్నం పోర్ట్ నుంచి ఉదయం 8.15 గంటలకు 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఈ హెస్పీడ్ క్రాఫ్ట్ (హెచ్ఎస్‌సీ) జర్నీ ప్రారంభించింది. కెప్టెన్ బిజు జార్జి కూడా ఇందులో ప్రయాణించారు. 50 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ ఫెర్రీ సర్వీసు ద్వారా సుమారు 60 నాటికల్ మైల్స్‌ను (110 కిలోమీటర్లు) సముద్ర జలాల పరిస్థితులను బట్టి సుమారు 3.30 గంటల వ్యవధిలో గమ్యాన్ని చేరుకోవచ్చు.


ప్రత్యేక ఫేర్..

తొలి జర్నీకి ప్రత్యేక ఫేర్‌ను నాగపట్నం షిప్పింగ్ హార్బర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ప్రత్యేక ఫేర్ 18 శాతం పన్నుతో కలిపి రూ.2,800గా నిర్ణయించారు. అక్టోబర్ 14న ఒక్కరోజు మాత్రమే ఈ ప్రత్యేక ఫేర్ వర్తిస్తుంది. అంటే రెగ్యులర్ ప్రైజ్‌లో ఇది 75 శాతం తగ్గింపు. రెగ్యులర్ టిక్కెట్ ధర రూ.6,500, 18 శాతం జీఎస్‌టీతో కలుపుకుని రూ.7,670గా నిర్ణయించారు.


ప్రధాని హర్షం..

ఇండియా-శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసు ప్రారంభం కావడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాల దౌత్య, ఆర్థిక సంబంధాలలో నూతన అధ్యాయమని, ఇరుదేశాల మధ్య పటిష్టబంధానికి ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. అనుసంధానం అనేది రెండు సిటీలను, రెండు దేశాలను, ప్రజలను, వారి మనసులను మరింత సన్నిహితం చేస్తుందన్నారు. ఇండియా, శ్రీలంక మధ్య సాంస్కృతిక, వాణిజ్య, నాగరికతా సంబంధమైన పటిష్ట సంబంధాలు ఉన్నాయన్నారు. సంగమ్ ఏజే లిటరేచర్‌లోనూ ఇరుదేశాల మధ్య పడవులు, నౌకలు నడిచేవని ఉన్నట్టు గుర్తు చేశారు.

Updated Date - 2023-10-14T18:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising