ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shashi Tharoor: మతం వ్యక్తిగతం, రాజకీయంగా దుర్వినియోగం కారాదు: శశిథరూర్

ABN, Publish Date - Dec 27 , 2023 | 05:51 PM

అయోధ్యలో ఈనెల 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించ లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ, మతం అనేది వ్యక్తిగతమైనదని, రాజకీయంగా దానిని దుర్వినియోగం చేయరాదని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: అయోధ్య (Ayodhya)లో ఈనెల 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించ లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) చెప్పారు. బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ, మతం అనేది వ్యక్తిగతమైనదని, రాజకీయంగా దానిని దుర్వినియోగం చేయరాదని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.. ఆలయాలు ప్రభుత్వ వ్యవహారం కాదంటూ సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.


ఆలయం వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వారి చేతుల్లో మీడియా ఆడుతోందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను శశిథరూర్ ప్రస్తావిస్తూ, పాలనా వైఫల్యాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రజా సంక్షేమం, జాతీయ భద్రత అనేవి ప్రధానాంశాలని, అయితే మీడియా ఈ అంశాలను పక్కనపెట్టి ఆలయం అంశాన్ని ఫోకస్ చేస్తోందన్నారు.

Updated Date - Dec 27 , 2023 | 05:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising