ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kolhapur clashes: కొల్హాపూర్‌లో ఉద్రిక్తత... ఇరువర్గాల ఘర్షణ, పోలీసుల లాఠీచార్జి

ABN, First Publish Date - 2023-06-07T15:23:27+05:30

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో బుధవారంనాడు ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తతలు చేటుచేసుకున్నాయి. సోషల్‌ మిడియాలో వచ్చిన వివాదాస్పద పోస్ట్ ఒకటి ఈ ఘర్షణలకు దారితీసింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్‌డీఆర్ఎఫ్, ఆర్ఏఎఫ్ బృందాలను రప్పించారు.

కొల్హాపూర్: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ (Kolhapur)లో బుధవారంనాడు ఇరువర్గాలు ఘర్షణకు (Clashes) దిగడంతో ఉద్రిక్తతలు చేటుచేసుకున్నాయి. సోషల్‌ మిడియాలో వచ్చిన వివాదాస్పద పోస్ట్ ఒకటి ఈ ఘర్షణలకు దారితీసింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్‌డీఆర్ఎఫ్, ఆర్ఏఎఫ్ బృందాలను రప్పించారు. సోషల్ మీడియాలో వచ్చిన వివాదాస్పద పోస్టుకు నిరసనగా పలు హిందూ సంస్థలు కొల్హాపూర్‌ టౌన్‌లో బంద్‌కు పిలుపునిచ్చాయి.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ప్రస్తుతిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ ఇరువర్గాల ఘర్షణలకు దారితీసింది. ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్ పోస్టర్లతో కొందరు సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు ఈ పోస్ట్‌లో కనిపిస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో ఒక వర్గానికి చెందిన వారు శివాజీ చౌక్ వద్ద సమావేశమై బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ కొద్దిసేపటికే అల్లర్లు మొదలవడంతో నిరసనకారులపై పోలీసులు లాఠీజార్జి జరిపారు..

శాంతిని పాటించండి..సీఎం పిలుపు

కొల్హాపూర్ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని, ప్రజలు ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళనకు దిగకుండా ఉండాలని కోరారు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, ఇలాంటి పనులను సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఒక వర్గానికి చెందిన వారు ఔరంగజేబ్‌ను ప్రస్తుతిస్తూ పోస్టులు పెట్టారని, ఇలాంటి వాటిని సహించేది లేదని అన్నారు. పలు జిల్లాల్లోనూ ఔరంగజేబ్‌ను ప్రస్తుతించే ఘటనలు వెలుగుచూశాయని, ఇవి అకస్మాత్తుగా జరిగినవి కావని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-06-07T15:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising