ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eknath Shinde: ఇప్పుడు మాది ట్రిపుల్ ఇంజన్ స్పీడ్..

ABN, First Publish Date - 2023-07-02T16:21:42+05:30

నేషనల్ కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీ-శివసేన కూటమిలో అజిత్ పవార్ చేరడం, వెంటనే ప్రభుత్వంలో రెండవ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారనీ, ఇంతవరకూ డబుల్ ఇంజన్‌గా ఉన్న తమ ప్రభుత్వం ట్రిపుల్ ఇంజన్‌‌ ప్రభుత్వమైందని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: నేషనల్ కాంగ్రెస్‌ పార్టీ (NCP)లో తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీ-శివసేన కూటమిలో అజిత్ పవార్ (Ajit Pawar) చేరడం, వెంటనే ప్రభుత్వంలో రెండవ ఉప ముఖ్యమంత్రిగా (Deputy CM) ప్రమాణస్వీకారం చేయడంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) స్పందించారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారనీ, ఇంతవరకూ డబుల్ ఇంజన్‌గా ఉన్న తమ ప్రభుత్వం ట్రిపుల్ ఇంజన్‌‌ ప్రభుత్వమైందని, మహారాష్ట్ర అభివృద్ధి కోసం అజిత్ పవార్‌ను. ఆయన తరఫు నేతలను సాదరంగా ఆహ్వానిస్తు్న్నానని చెప్పారు. మహారాష్ట్రలో అధికార కూటమి మరింత బలపడడానికి అజిత్ పవార్ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు.

అప్పుడే ఏమి తొందర?

క్యాబినెట్‌లో సీట్ల షేరింగ్‌పై మీడియా ప్రశ్నించగా, దీనిపై చర్చించేందుకు చాలా సమయం ఉందని ఏక్‌నాథ్ షిండే సమాధానమిచ్చారు. తామంతా కలిసికట్టుగా మహారాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. లోక్‌సభలో విపక్షాలకు 4 నుంచి 5 సీట్లు ఉన్నాయని, ఈసారి ఆ సీట్లు కూడా వారికి రావడం కష్టమని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

చీలికా? అనర్హతా?

కాగా, నలభై మంది ఎమ్మెల్యేల మద్దతుతో తాను ప్రమాణం చేసినట్టు అజిత్ పవార్ చెబుతుండగా, అనేక ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిణామం శివసేన తరహాలోనే ఎన్‌సీపీలో చీలినట్టుగా భావించాల్సి ఉంటుందా? అజిత్‌పై ఎన్‌సీపీ అనర్హత వేటు వేస్తుందా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

సంజయ్ రౌత్ ఏమన్నారంటే..?

తాజా రాజకీయ పరిణామాలపై శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఇప్పుడే తాను శరద్ పవార్‌తో మాట్లాడినట్టు చెప్పారు. తాను చాలా బలంగా ఉన్నానని, ప్రజల మద్దతుతో ఉద్ధవ్ థాకరేతో కలిసి తిరిగి పార్టీ పునర్నిర్మాణం జరుపుతానని పవార్ చెప్పారని తెలిపారు.

Updated Date - 2023-07-02T16:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising