ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russia : పుతిన్ నడిచేటపుడు కుడిచేయి ఎందుకు కదలదో తెలిసిపోయింది!

ABN, First Publish Date - 2023-02-04T17:07:25+05:30

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి.

Vladimir Putin
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. ఆయన నడక తీరు, ముఖ కవళికలు ఏదో తీవ్రమైన వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు వెల్లడిస్తున్నాయనే కథనాలు వస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు అమలు చేస్తున్న ఆంక్షల వల్ల ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని కూడా కొందరు అంటున్నారు. ఆయన నడిచేటపుడు ఆయన కుడి చేయి కదలకుండా స్థిరంగా ఉంటుందని, ఆయన ఎడమ చేయి మాత్రం స్వేచ్ఛగా కదులుతూ ఉంటుందని అంటున్నారు.

వ్లదిమిర్ పుతిన్ మొదట్లో రష్యా (Russia) దేశ భద్రత, విదేశీ నిఘా సంస్థ కేజీబీ (KGB) అధికారిగా పని చేసేవారు. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడిగా ఆయన ఉక్రెయిన్‌ (Ukraine)పై యుద్ధం చేస్తున్నారు. దీంతో పాశ్చాత్య దేశాలు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలను అమలు చేస్తున్నాయి. దీంతో రష్యా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. మరోవైపు పుతిన్ ఆరోగ్యంపై అనేక కథనాలు వస్తున్నాయి. వీటిలో ఒకటి ఆయన నడక తీరుపై కనిపిస్తోంది. ఆయన నడిచేటపుడు కుడి చేయి కదలకుండా స్థిరంగా ఉంటుందని, ఎడమ చేయి స్వేచ్చగా కదులుతుందని కొందరు చెప్తున్నారు. డాక్టర్లు మాత్రం దీనికి కారణం ఏదో ఓ వ్యాధి కాదని చెప్తున్నారు. వణకడం, గట్టిబడటం, సమన్వయం లేకపోవడం వంటి లక్షణాలేవీ ఆయన కుడి చేతికి లేవని అంటున్నారు. ఆయన జూడో బ్లాక్ బెల్ట్ సాధించిన యోధుడని, వెయిట్ లిఫ్టర్, స్విమ్మర్ కూడానని చెప్తున్నారు. ఆయన చాలా వేగంగా రాయగలరని, సంతకం చేసేటపుడు చేయి వణకదని చెప్తున్నారు.

కొందరు పరిశోధకులు చెప్తున్నదాని ప్రకారం, రష్యా అధ్యక్షుడు పుతిన్ నడిచేటపుడు ఆయన కుడి చేయి కదలకపోవడానికి కారణం వ్యాధి కాదు. ఆయన సైనిక, నిఘా సంస్థల్లో అత్యంత కఠినంగా శిక్షణ పొందారు. దీనివల్ల ఆయన ప్రవర్తనలోనే అటువంటి లక్షణం ఉంది. సోవియెట్ కేజీబీలో ఆయన ఆయుధాల వాడకంలో శిక్షణ పొందారు. సోవియెట్ యూనియన్ ముక్కలవడానికి పూర్వం ఆయన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుకు ఎదిగారు.

కేజీబీ ఆఫీసర్ ఏ విధంగా నడవాలో కేజీబీ మాన్యువల్ స్పష్టంగా వివరించింది. ఏ క్షణంలోనైనా ఆయుధాలను హ్యాండిల్ చేయడం కోసం అనువైన నడకతీరు ఉండాలని ఈ మాన్యువల్ చెప్తోంది. శత్రువును అకస్మాత్తుగా ఎదుర్కొనవలసి వచ్చినపుడు కుడి చేతితో తుపాకీని వేగంగా తీసుకోవడానికి వీలుగా ఉండేలా నడవాలని ఇది చెప్తోంది. ఛాతీకి దగ్గరగా కుడిచేతిని ఉంచుకోవాలని చెప్తోంది. ఒకవైపు అంటే ఎడమవైపు నుంచి ముందుకు నడవాలని కూడా చెప్తోంది. పుతిన్ నడక తీరు ఈ మాన్యువల్‌కు అనుగుణంగానే ఉంటుంది.

Updated Date - 2023-02-04T17:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising