ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

S Jaishankar : భారత్‌కు గౌరవం దక్కకపోతే నేను తలక్రిందులవుతాను : విదేశాంగ మంత్రి

ABN, First Publish Date - 2023-06-18T14:09:37+05:30

భారత దేశానికి గౌరవం దక్కకపోతే తాను తలక్రిందులవుతానని, చాలా బాధపడతానని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) చెప్పారు. తనపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించేవారిని తాను పట్టించుకోనని, అయితే భారత దేశాన్ని గౌరవించకపోతే, ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తే, తాను తీవ్ర ఆవేదనకు గురవుతానని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశానికి గౌరవం దక్కకపోతే తాను తలక్రిందులవుతానని, చాలా బాధపడతానని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) చెప్పారు. తనపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించేవారిని తాను పట్టించుకోనని, అయితే భారత దేశాన్ని గౌరవించకపోతే, ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తే, తాను తీవ్ర ఆవేదనకు గురవుతానని చెప్పారు. ఈ ఏడాది మార్చి 19న లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ వద్ద జరిగిన హింసాత్మక సంఘటనల్లో మన దేశ జాతీయ జెండాను అవమానించిన విషయాన్ని ‘ది రణ్‌‌వీర్ షో’ అనే పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో ఆయన ప్రస్తావించారు.

లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయం వద్ద మార్చి 19న ఖలిస్థాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఖలిస్థాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్‌కు, ఖలిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ అధిపతి అవతార్ సింగ్ ఈ కార్యాలయంపైనగల భారత దేశ జాతీయ పతాకాన్ని తొలగించినట్లు సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. అప్పట్లో జైశంకర్ మాట్లాడుతూ, కట్టుదిట్టమైన భద్రత కల్పించడంలో బ్రిటన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దౌత్యవేత్తలు తమ పని తాము చేసుకోవడానికి తగిన భద్రతను కల్పించవలసిన కర్తవ్యం ప్రతి దేశానికి ఉంటుందన్నారు.

దక్షిణ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య నిర్వహించిన ‘ది రణ్‌వీర్ షో’ అనే పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం జైశంకర్ మాట్లాడుతూ, భారత దేశాన్ని గౌరవించనివారిని చూస్తే తనకు ఒళ్లు మండుతుందన్నారు. భారత దేశానికి గౌరవం దక్కకపోతే తాను తలక్రిందులవుతానని, చాలా బాధపడతానని చెప్పారు. మార్చి 19న లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపైనగల భారత దేశ జాతీయ పతాకాన్ని తొలగించేందుకు ఓ వ్యక్తి ఎగబాకుతున్న సమయంలో తాను విమానం నుంచి దిగానని చెప్పారు. ఆ దృశ్యం చూసేసరికి తనకు చాలా కోపం వచ్చిందన్నారు. తాను తలక్రిందులయ్యానని చెప్పారు. తనపై ఎవరైనా ఆధిపత్యం చలాయించినపుడు తాను పట్టించుకోనని, అదే భారత దేశం విషయంలో అలా జరిగితే తాను తీవ్రంగా బాధపడతానని చెప్పారు. అలాంటివారు మనల్ని గౌరవించరని, మనపై ఆధిపత్యం చలాయిస్తారని, కొన్నిసార్లు దొంగ దెబ్బ తీస్తారని అన్నారు.

అవతార్ సింగ్ మృతి

లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయం వద్ద హింసాత్మక సంఘటనలకు సూత్రధారి అవతార్ సింగ్ జూన్ 15న మరణించాడు. బ్రిటన్‌లోని సిక్కు ఫెడరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయన బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారని, చికిత్స పొందుతూ మరణించారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన

Extreme heatwave : ఉత్తరాదిలో విపరీతమైన వడగాడ్పులు.. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో 98 మంది మృతి..

Updated Date - 2023-06-18T14:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising