ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sharad Pawar: ఇదేమీ చిన్న విషయం కాదు, దోపిడీ..!..సీనియర్ పవార్ ఫైర్..

ABN, First Publish Date - 2023-07-02T18:54:23+05:30

నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో అజిత్‌ పవార్ బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఆదివారంనాడు చేరడం, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ఎన్‌సీపీ చీఫ్, మరాఠా దిగ్గజ నేత శరద్ పవార్ మండిపడ్డారు. ఇదేమీ గుగ్లీ కాదని, రాబరీ అని అన్నారు. అయితే, ఇలాంటివేమీ తనకు కొత్త కాదని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీకి (NCP) చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో అజిత్‌ పవార్ (Ajit Pawar) బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఆదివారంనాడు చేరడం, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ఎన్‌సీపీ చీఫ్, మరాఠా దిగ్గజ నేత శరద్ పవార్ (Sharad Pawar) మండిపడ్డారు. ఇదేమీ గుగ్లీ కాదని, రాబరీ అని, ఎంతమాత్రం చిన్న విషయం కాదని అన్నారు. అయితే, ఇలాంటివేమీ తనకు కొత్త కాదని అన్నారు. ఇలాంటివి జరిగిన ప్రతిసారి తిరిగి పార్టీని నిలబెట్టుకుని పటిష్టం చేశామని చెప్పారు.

''ఎన్‌సీపీకి 1980లో సారథ్యం వహించినప్పుడు 58 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు మినహా అందరూ పార్టీని వదలి వెళ్లిపోయారు. మళ్లీ పార్టీని పటిష్టం చేసి, సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ వెళ్లాం. పార్టీని వీడి వెళ్లిన వాళ్లంతా సొంత నియోజకవర్గాల్లోనే ఓటమి చవిచూశారు'' అని పవార్ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించారు.

బాధపడేది లేదు...

ఈరోజు జరిగిన పరిణామాలపై తనకు ఎలాంటి బాధ లేదని పవార్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తదితరుల నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చినట్టు చెప్పారు. అయితే, తాను చెప్పదలచుకున్నది ఒక్కటేనని, ఇవాళ జరిగిన పరిణామాలకు తానేమీ బాధపడటం లేదని, రేపు (సోమవారం) వైబీ చవాన్ (మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి) ఆశీస్సులు తీసుకుని బహిరంగ సభ నిర్వహిస్తానని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎన్‌సీపీ నేతలు ఎందుకు చేతులు కలిపారనే విషయం ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. బీజేపీ తమను పిలిచినట్టు కొందరు నేతలు తనతో చెప్పారని, మరికొందరు ప్రభుత్వంతో కలవడానికి వేరే కారణాలున్నాయని చెప్పారని పవార్ తెలిపారు.

ఈ దోపిడీ క్రెడిట్ మోదీదే...

''నా ఇల్లు (ఎన్‌సీపీ) చీలిపోయిందని నేను ఎప్పుడూ చెప్పను. ఇది నా ఇంటి సమస్య కాదు. ఇది ప్రజల సమస్య. పార్టీని వీడివెళ్లిన నేతల భవిష్యత్ గురించే నేను బాధపడుతున్నాను. ఇప్పుడు జరిగిన పరిణామాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇవ్వాలనుకుంటున్నాను. రెండు రోజుల క్రితం ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత కొందరు వ్యక్తులు ఇబ్బందిగా ఫీలయ్యారు. మరికొందరు ఈడీ చర్యలను ఎదుర్కొన్నారు'' అని పవార్ చెప్పారు.

పార్టీని తిరిగి పటిష్టం చేస్తా...

మహారాష్ట్ర ప్రజల పట్ల, ముఖ్యంగా యువత పట్ల తనకెంతో నమ్మకం ఉందని, తమను ఎన్నుకున్న సామాన్య ప్రజలే పార్టీకి వెన్నుదన్ను అని చెప్పారు. పార్టీని తాను తిరిగి పటిష్టం చేస్తానని తెలిపారు. ''మళ్లీ పార్టీని పటిష్టం చేసేందుకు పని చేస్తాం. పార్టీపై తిరుగుబాటు చేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయాన్ని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరితో కలిసి చర్చించి నిర్ణయిస్తాం. పార్టీ అధ్యక్షుడిగా, ప్రఫుల్ పటేల్, సునిల్ టట్కరేలను నేను నియమించాను. అయితే వాళ్లు అప్పగించిన బాధ్యతను పాటించలేదు. అందువల్ల వారిపై తగిన చర్యలు తీసుకుంటాను'' అని పవార్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-02T18:54:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising