Rahul disqualification: జయలలిత, లాలూప్రసాద్ యాదవ్ సహా అనర్హత వేటుపడిన పొలిటీషియన్స్ వీళ్లే..
ABN, First Publish Date - 2023-03-24T17:17:30+05:30
మోడీ ఇంటిపేరు’ (Modi surname) వివాదాస్పద వ్యాఖ్యలతో పరువునష్టం దావా కేసులో ( defamation case) దోషిగా తేలిన కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ అనూహ్యంగా మాజీ ఎంపీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో..
‘మోడీ ఇంటిపేరు’ (Modi surname) వివాదాస్పద వ్యాఖ్యలతో పరువునష్టం దావా కేసులో ( defamation case) దోషిగా తేలిన కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ అనూహ్యంగా మాజీ ఎంపీగా మారిపోయారు. రెండేళ్లు జైలుశిక్షపడడంతో ఎంపీగా అనర్హుడిని చేస్తున్నట్టు (Rahul Gandhi disqualification) లోక్‌సభ సెక్రటేరియేట్ ప్రకటించింది. భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని నిబంధనల ఈ నిర్ణయం తీసుకున్నామని లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు. ఇది దౌర్జన్యమైన నిర్ణయమని, దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. పరువునష్టం దావా కేసు, సూరత్ కోర్ట్ తీర్పు పర్యవసానంగా రాహుల్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రజాప్రాతినిథ్య చట్టం-1951 మరోసారి చర్చనీయాంశమైంది. అసలు జైలుశిక్షలు పడిన రాజకీయ నాయకుల విషయంలో ఈ చట్టం ఏం చెబుతుంది?.. దేశంలో ఇప్పటివరకు ఎంతమంది అనర్హతకు గురయ్యారో ఒకసారి పరిశీలిద్దాం..
ప్రజాప్రాతినిధ్య చట్టం (1951)లోని సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం... ఏదైనా కేసులో ఒక ప్రజాప్రతినిధి దోషిగా నిర్ధారణ అయి రెండేళ్లు, అంతకుమించి జైలుశిక్ష పడితే చట్టసభ సభ్యులు తమ సభ్యత్వం కోల్పోతారు. శిక్షాకాలంతో పాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కూడా కోల్పోతారు. అనర్హత నేపథ్యంలో ఉన్నతస్థానాల్లో కూడా రాహుల్ గాంధీకి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే మొత్తం ఎనిమిదేళ్లపాటు రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. ‘లిల్లీ థామస్ తీర్పు’లో సందర్భంగా రెండేళ్లు, అంతకుమించిన శిక్ష పడితే ఆటోమేటిగ్గా ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే నేర నిర్ధారణను సస్పెండ్ చేస్తే.. అనర్హతను కూడా నిలుపుదల చేయాలని 2018లో లోక్ ప్రభారీ కేసులో ఓ అప్పీల్‌పై సుప్రీం తీర్పునిచ్చిందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరి రాహుల్ గాంధీ అనర్హత విషయంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో వేచిచూడాలి.
ఇప్పటివరకు అనర్హతకు గురయ్యింది వీళ్లే..
- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత 2017లో అనర్హతకు గురయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 4 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా పడింది. దీంతో ఎమ్మెల్యే పదవికి అనర్హతకు గురయ్యి సీఎం పదవి నుంచి దిగిపోయారు. కానీ కర్ణాటక హైకోర్ట్ నిర్ధోషిగా ప్రకటించడంతో జయలలితకు అవరోధాలన్నీ తొలగిపోయాయి.
- బిహార్‌లోని సరన్ ఎంపీగా ఉన్నప్పుడు ఆర్‌జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్‌లో 2013 సెప్టెంబర్‌లో అనర్హత వేటు పడింది. దాణా కేసులో 5 ఏళ్ల జైలుశిక్షపడడం ఇందుకు కారణమైంది.
- లక్షద్వీప్ మాజీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఈ ఏడాది జనవరి 23న డిస్‌క్వాలిఫై అయ్యారు. హత్యాయత్నం కేసులో అతడిని సెషన్స్ కోర్ట్ దోషిగా తేల్చడం, రెండేళ్లకుమించి జైలుశిక్షపడడం ఇందుకు కారణమైంది.
- రామ్‌పూర్ మాజీ ఎంపీ ఆజం ఖాన్ 2019లో విద్వేష ప్రసంగం కేసులో దోషిగా తేలారు. రెండేళ్లకంటే ఎక్కువ జైలుశిక్షపడడంతో అనర్హత వేటుపడింది.
ఈ జాబితాలో కమల్ కిశోర్ భగత్ (జార్ఖండ్ ఎమ్మెల్యేగా), సురేష్ హల్వాంకర్ (మహారాష్ట్ర ఎమ్మెల్యేగా), టీఎం సెల్వగణపతీ (తమిళనాడు ఎంపీగా), బాబన్‌రావ్ ఘోలప్ (మహారాష్ట్ర ఎమ్మెల్యేగా), ఎనోస్ ఎక్కా (జార్ఖండ్ ఎమ్మెల్యేగా), ఆశా రాణి (బిహార్ ఎంపీగా), జగదీష్ శర్మ (బిహార్ ఎంపీగా), పప్పు కలానీ (మహారాష్ట్ర ఎమ్మెల్యే)గా వేర్వేరు నేరాల్లో దోషులుగా తేలి, జైలుశిక్షలు పడడంతో వీరంతా అనర్హతకు గురయ్యారు.
ఇవీ చదవండి..
రాహుల్ గాంధీపై అనర్హత వేటు
ఇందిర.. రాహుల్.. ఇద్దరికీ కర్ణాటక లింక్
Updated Date - 2023-03-24T17:28:43+05:30 IST