Trains: 22 వరకు చెన్నై - బిట్రగుంట రైళ్ల రద్దు
ABN, First Publish Date - 2023-09-20T10:28:33+05:30
విజయవాడ డివిజన్ పరిధిలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా చెన్నై-బిట్రగుంట(Chennai - Bitragunta) రైళ్లు
పెరంబూర్(చెన్నై): విజయవాడ డివిజన్ పరిధిలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా చెన్నై-బిట్రగుంట(Chennai - Bitragunta) రైళ్లు ఈ నెల 22వ తేది వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకారం, బిట్రగుంట(Bitragunta)లో తెల్లవారుజామున 4.45 గంటలు, చెన్నైలో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరే రైళ్లు మంగళవారం నుంచి ఈ నెల 22వ తేది వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Updated Date - 2023-09-20T10:28:33+05:30 IST