ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trains: పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

ABN, First Publish Date - 2023-03-24T10:10:09+05:30

కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్‌ వద్ద జరుగుతున్న రైల్వే లైన్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దుచేసి, మరికొన్నింటికి దారిమళ్లిం చినట్లు రైల్వే అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంతకల్లు/బెంగళూరు: కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్‌ వద్ద జరుగుతున్న రైల్వే లైన్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దుచేసి, మరికొన్నింటికి దారిమళ్లిం చినట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు- ధర్మవరం- బెంగళూరు(Bangalore- Dharmavaram- Bangalore) ఎక్స్‌ప్రెస్‌ (నెం. 06595/96) అప్‌ అండ్‌ డౌన్‌ రైళ్లను ఏప్రిల్‌ 1, 6, 29 తేదీల్లో రద్దుచేసినట్లు పేర్కొన్నారు. పూరి-యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22883) రైలును ఈ నెల 31న డోన్‌, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యల్హంక స్టేషన్ల మీదుగా కాకుండా నంద్యాల, ఎర్రగుంట్ల, రేణిగుంట, జోలరరన్‌పట్టై, హెబ్బల్‌, బన్సువాడి, యశ్వంతపూర్‌ స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. అలాగే ముంబై-కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్‌ (నెం. 11013) రైలును ఈ నెల 31న అనంతపురం, ధర్మవరం, ఎస్‌ఎస్‌పీఎన్‌, హిందూపురం, గౌరిబిదనూరు, బెంగళూరు ఈస్ట్‌, బెంగళూరు కంటోన్మెంటు, బెం గళూరు సిటీ, హోసూరు, ధర్మపురి స్టేషన్ల మీదుగా కాకుండా గుంతకల్లు, రేణి గుంట, జోలార్‌పట్టై, సేలం మీదుగా దారిమళ్లించనున్నట్లు తెలిపారు.

ప్యాసింజరు రద్దు: రైల్వే లైన్‌ మెయింటెనెన్స్‌ పనుల కారణంగా గుంతకల్లు-రాయచూరు (నెం. 07799) ప్యాసింజరును ఇప్పటి నుంచి నెలాఖరు వరకూ, దీని తిరుగు ప్రయా ణపు రైలు (నెం. 07800)ను ఏప్రిల్‌ 1వ తేదీ వరకూ రద్దుచేసినట్లు అధికా రులు వెల్లడించారు.

Updated Date - 2023-03-24T10:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising