ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chhattisgarh: కొత్త సీఎంగా గిరిజన నేత విష్ణు దేవ్ సాయి

ABN, First Publish Date - 2023-12-10T16:26:07+05:30

గిరిజన నేత, కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయిని ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో ఇంతవరకూ అతిపెద్ద నాయకుడిగా ఉన్న మాజీ సీఎం రమణ్ సింగ్‌కు అత్యంత సన్నిహతుడుగా విష్ణు దేవ్ సాయికి పేరుంది.

రాయపూర్: గిరిజన నేత, కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయి (Vishnu Deo Sai)ని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కొత్త ముఖ్యమంత్రిగా (Chief minister) బీజేపీ (BJP) ప్రకటించింది. రాష్ట్రంలో ఇంతవరకూ అతిపెద్ద నాయకుడిగా ఉన్న మాజీ సీఎం రమణ్ సింగ్‌కు అత్యంత సన్నిహతుడుగా విష్ణు దేవ్ సాయికి పేరుంది. 59 ఏళ్ల విష్ణు దేవ్ 2006లో పార్టీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ఉక్కు (steel) శాఖ జూనియర్ మినిస్టర్‌గా పనిచేశారు.


కాగా, సీఎం ఎంపిక కోసం రాయపూర్‌లో ఆదివారంనాడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై విష్ణుదేవ్ సాయి పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద్ సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ హాజర్యయారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార కాంగ్రెస్‌ను ఓడించి 54 సీట్లతో సంపూర్ణ మెజారిటీని సాధించింది. నార్త్ ఛత్తీస్‌గఢ్‌లోని కుంకూరి నియోజకవర్గం నుంచి విష్ణుదేవ్ సాయి పోటీ చేసి గెలుపొందారు.

Updated Date - 2023-12-10T17:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising