ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tungabhadra: తుంగభద్రలోకి 41వేల క్యూసెక్కుల నీరు

ABN, First Publish Date - 2023-07-23T13:40:59+05:30

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోకి కొద్దికొద్దిగా నీరు చేరుతోంది. గత కొద్ది రోజులుగా జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వ

బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోకి కొద్దికొద్దిగా నీరు చేరుతోంది. గత కొద్ది రోజులుగా జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కారణంగా శనివారం ఉదయానికి 41వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లో వచ్చి చేరుతుంది. కేవలం 3టీఎంసీల నీరున్న జలాశయంలో ఇప్పుడు 17టీఎంసీల నీరు సంగ్రహమైంది. ఇన్‌ప్లో ఆదివారానికి 20టీఎంసీలకు చేరుకోనుంది.తుంగజలాశయం నుంచి 19వేల నీటిని విడుదల చేశారు. దీనికి తోడు తుంగభద్ర నదికి ఇతర ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌ గరిష్ట మట్టం 1633 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 1596 అడుగులు. రెండు మూడు రోజుల్లో రిజర్వాయర్‌ మట్టం 1600 వేలకు చేరే అవకాశం ఉంది. ఈ జలాశయం ద్వారా రాష్ట్రంలోని బళ్లారి, విజయనగరం, కొప్పళ, రాయచూరు(Bellary, Vizianagaram, Koppala, Raichur) జిల్లాలోని లక్షల ఎకరాలకు నీరు అందనుంది. నదిలోని కంప్లి, రామసాగర, సూగూరు, ఇటగి, ఎరకల్లు,సిరుగుప్ప ప్రాంతాల రైతులు ఇప్పటికే వరి నాట్లు ప్రారంభించారు. నారు కుండీలు సిద్దం చేశారు. కాల్వలకు నీటి విడుదల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-07-23T13:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising