ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tungabhadra: తుంగభద్రకు భారీగా వరద నీరు

ABN, First Publish Date - 2023-07-27T12:37:25+05:30

తుంగభద్ర(Tungabhadra) నది పైప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి భారీగా వ

బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర(Tungabhadra) నది పైప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. 1,12,171 క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం ఒక్క రోజే తుంగభద్ర జలాశయానికి 12.5 టీఎంసీల మేర వరద నీరు చేరడంపై బోర్డు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారంలోగా తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 44.190 టీఎంసీల నీటి సేకరణ జరిగినట్లు బోర్డు అధికారులు తెలిపారు. జలాశయం ఎత్తు 1633 అడుగులు కాగా బుధవారం నాటికి 1613.27 అడుగుల మేర నీటిమట్టం చేరుకున్నట్లు వివరించారు. తుంగభద్ర పైభాగంలోని ఆగొంబె, వర్ణాడు, ఖుదరేముఖ్‌, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా శివమొగ్గ జిల్లా పరిధిలోని తుంగ ప్రమాద స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. తుంగ జలాశయం గరిష్ట నీటి మట్టం 588.24 మీటర్లు కాగా, ప్రస్తుతం 587.69 మీటర్లకు చేరుకుంది. జలాయశంలో 69వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం భద్రత దష్ట్యా వచ్చి నీటిని అలాగే దిగువకు వదులుతుండడంతో అదంతా తుంగభద్ర జలాశయానికి వచ్చి చేరుతుండడంతో వరదనీటి చేరిక గంటగంటకు పెరుగుతోంది.

Updated Date - 2023-07-27T12:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising