ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jawans Abuse: ఇద్దరు జవాన్ల అమానవీయ ప్రవర్తన.. కేవలం నీళ్లు అడిగిన పాపానికి..

ABN, First Publish Date - 2023-07-30T15:35:10+05:30

వాళ్లిద్దరు ప్రాంతీయ రక్షక్ దళానికి చెందిన జవాన్లు. ప్రజలకు సేవ చేయడమే వారి పని. కానీ.. అందుకు భిన్నంగా ఆ జవాన్లు ఓ నీచపు పనికి పాల్పడ్డారు. ఒక వికలాంగుడి పట్ల అమానుషంగా..

వాళ్లిద్దరు ప్రాంతీయ రక్షక్ దళానికి చెందిన జవాన్లు. ప్రజలకు సేవ చేయడమే వారి పని. కానీ.. అందుకు భిన్నంగా ఆ జవాన్లు ఒక వికలాంగుడి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. బూతుపురాణం సంధించడంతో పాటు అతనిపై దాడికి తెగబడ్డారు. కేవలం నీళ్లు అడిగిన పాపానికి.. ఆ ఇద్దరు జవాన్లు ఈ దుశ్చర్యకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై అధికారులకి చేరడంతో.. దీనిపై వాళ్లు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సచిన్ సింగ్ అనే 28 ఏళ్ల బాధితుడు 2016లో ముంబైలో ఒక రైలు ప్రమాదంలో తన కాళ్లు కోల్పోయాడు. అయినప్పటికీ.. మనోధైర్యం కోల్పోలేదు. అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా.. సిమ్ విక్రేతగా, డెలివరీ బాయ్‌గా పని చేయడం మొదలుపెట్టాడు. ఎప్పట్లాగే శనివారం తన విధులు నిర్వర్తించుకొని.. శనివారం అర్థరాత్రి ఇంటికి తిరుగుపయనం అయ్యాడు. అయితే.. మార్గమధ్యంలో అతనికి ఒక తాబేలు కనిపించింది. దాన్ని ఎత్తుకొని, దూధేశ్వర్ నాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న ఓ చెరువులో వదిలేశాడు. అక్కడికి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో.. అతనికి ఇద్దరు పీఆర్డీ జవాన్లు కనిపించారు. తాబేలుని పట్టుకున్న కారణంగా చేతుల నుంచి దుర్వాసన వస్తుండటంతో.. తన చేతులు కడుక్కోవడం కోసం ఆ ఇద్దరు జవాన్లను నీళ్లు అడిగాడు.


అప్పుడు ఆ ఇద్దరు జవాన్లు తమనే నీళ్లు అడుగుతావా? అంటూ సచిన్‌ని బూతులు తిడుతూ కొట్టారు. జైల్లో వేస్తామని బెదిరించారు. అంతేకాదు.. అతని ట్రైసైకిల్ తాళం కూడా లాక్కున్నారు. తాళం తీసుకుంటున్నప్పుడు వాళ్లను సచిన్ అడ్డుకోబోగా.. ఆ జవాన్లు కొట్టారు. ఈ మొత్తం తతంగాన్ని ఒక వ్యక్తి తన టెర్రస్‌పై నుంచి ఫోన్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో.. అనతికాలంలోనే ఇది వైరల్ అయ్యింది. దీంతో.. చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ దీనిపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు అధికారుల నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆ ఇద్దరు జవాన్లను గుర్తించి, వారిని విధుల నుంచి తొలగించారు. నిందితులను పీఆర్‌డీ జవాన్లైన రాజేంద్ర మణి, అభిషేక్ సింగ్‌లుగా గుర్తించారు.

Updated Date - 2023-07-30T15:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising