ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Udayanidhi: మోదీపై మంత్రి సెటైర్లు.. పైలట్‌ లేకుండా వెళ్తారేమో కానీ.. అదానీ లేకుండా మాత్రం వెళ్లరు..

ABN, First Publish Date - 2023-08-13T07:54:32+05:30

ప్రధాని మోదీ పైలెట్‌ లేకుండా విమానంలో వెళ్తారేమో కానీ, అదానీ తోడు లేకుండా వెళ్లరని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి

పెరంబూర్‌(చెన్నై): ప్రధాని మోదీ పైలెట్‌ లేకుండా విమానంలో వెళ్తారేమో కానీ, అదానీ తోడు లేకుండా వెళ్లరని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఎద్దేవా చేశారు. కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి శతజయంతి వేడుకలు శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి ఉదయనిధి, కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రజలకు సంక్షేమ సహాయాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్నాడీఎంకే, డీఎంకే(AIADMK, DMK)లకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఎంజీఆర్‌ శతజయంతి ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చుచేశారని, ప్రస్తుతం కలైంజర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలకు సంక్షేమ సహాయాలు అందజేస్తున్నామని తెలిపారు. అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రుల ఇళ్లపై సోదాలు నిర్వహించి, వారిని బెదిరించే చర్యలను బీజేపీ చేపట్టిందన్నారు. బీజేపీ పాలనతో అదానీ కుటుంబం మా త్రమే ఆర్ధికంగా లబ్ధి పొందిందని ఆరోపించారు. తాము ఏ భాషకు వ్యతిరేకం కాదని, నిర్భంధ హిందీ అంటే అనుమతించే ప్రసక్తే లేదని మంత్రి ఉదయనిధి తెలిపారు.

Updated Date - 2023-08-13T07:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising